తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందించాలని కంపెనీ యాజమాన్యాలను మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. కంపెనీలు అన్నీ ఒకే ధరకు సరాఫరా చేయాలని సూచించారు. దీనిపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఈ పథకానికి సహకారం అందించడం తమ అదృష్టమని మంత్రులతో అన్నారు.

కాగా, ఇప్పటికే తెలంగాణలో చాలామంది మహిళలు ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులయ్యారు. స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం చూసే మహిళలకు ప్రభుత్వం ఎంతగానో సహాయం చేస్తోంది. దీంతో తెలంగాణలోని మహిళలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇల్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ లను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేద మహిళలు డబుల్ బెడ్ రూమ్ పొందడానికి అర్హులయ్యారు. త్వరలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించనుంది.