భారతీయ సంస్కృతిలో పండుగలు శుభకార్యాలలో తమలపాకు కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించిన ఆకు మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక అద్భుతమైన ఆకు. పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో తమలపాకు కు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో తమలపాకు కు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తమలపాకులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ క్రియకు మేలు : భోజనం తర్వాత తమలపాకు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచి మెడిసిన్.
నోటి ఆరోగ్యం: తమలపాకులో యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించి, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అలాగే చిగుళ్ల వాపు, దంత క్షయం వంటి సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది.
నొప్పుల నివారణకు: కీళ్ల నొప్పులు శరీర నొప్పులు ఉన్నప్పుడు తమలపాకును ఆవనూనెలో వేడి చేసి నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి.

శ్వాస కోస సమస్యలు: దగ్గు, జలుబు వంటి శ్వాస కోస సమస్యలకు తమలపాకు మంచి నివారణ తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
గాయాలు మానడానికి: చిన్నపాటి గాయాలు పుండ్లపై, తమలపాకును పెడితే అవి త్వరగా నయం అవుతాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
తమలపాకును పాన్ లాగా పొగాకు, సున్నంతో కలిపి వాడడం వల్ల ఆరోగ్యానికి హానికరం. దీనిని నేరుగా లేదా ఔషధంగా మాత్రమే ఉపయోగించాలి.
గమనిక :పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.