చంద్రబాబుకు షాక్… వైసీపీలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే… తాజాగా ముద్రగడ పద్మనాభంను కలిశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని గతంలో ప్రతిజ్ఞ చేశారు ముద్రగడ పద్మనాభం.

ఇటీవల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత ముద్రగడను వర్మ కలవడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో చేరేందుకే వర్మ ముద్రగడను కలిశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం… రేపు ఉదయం 11 గంటలకు వైసీపీ పార్టీలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.
వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..?
ముద్రగడ పద్మనాభంను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని గతంలో ప్రతిజ్ఞ చేసిన ముద్రగడ
ఇటీవల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య తలెత్తిన విభేదాలు
ఈ నేపథ్యంలో వైసీపీ నేత… pic.twitter.com/UegqMBhMpo
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2025