ప్రోటీన్ మన శరీరానికి చాలా ముఖ్యం కండరాలు బలంగా ఉండడానికి చర్మం జుట్టు, ఆరోగ్యంగా ఉండడానికి కణాల మరమ్మతుకు రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్ అవసరం. మాంసాహారులకు సులభంగా ప్రోటీన్ లభిస్తుంది. కానీ శాఖాహారులకు అంత సులభం కాదు సరైన ఆహార పదార్థాలను ఎంచుకుంటూ, శాఖాహారులు కూడా పుష్కలమైన ప్రోటీన్ ను పొందవచ్చు. అలా ప్రోటీన్ ఎక్కువగా లభించే కొన్ని రకాల గింజలు, విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం: శరీరానికి కావాల్సిన ప్రోటీన్ తో పాటు విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
వాల్నట్ : ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుగ్గా ఉండడానికి సహాయపడుతుంది.
పిస్తా: ప్రోటీన్ ఫైబర్, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్.
పల్లీలు :ధర తక్కువగా ఉన్న ప్రోటీన్,ఫైబర్ ఆరోగ్యం కరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి.
గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు : గుమ్మడి గింజల్లో మెగ్నీషియం,జింక్, ప్రోటీన్ అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ E, ప్రోటీన్, సెలీనియం ఇందులో ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

చియా విత్తనాలు : చిన్నగా ఉన్న వీటిలో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
అవిసె, జనపనార గింజలు : అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి వీటిలో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే జనపనార గింజలు ఏమైనా ఆన్లైన్లో కలిగి ఉన్న పూర్తి ప్రోటీన్ వనరు.
నువ్వులు:ప్రోటీన్ తో పాటు క్యాల్షియం,మెగ్నీషియం ఐరన్ నువ్వుల్లో ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం.
రోజువారి ఆహారంలో ఈ పది గింజలు, విత్తనాలను చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్ సులభంగా పొందవచ్చు వీటిని స్నాక్స్ గా సలాడ్స్ పై చల్లుకొని లేదా స్మూతీస్ లో కలుపుకొని తినవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ఇవి చాలా ముఖ్యమైనవి.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.