బ్రెడ్‌పై పీనట్‌ బటర్‌ రాసుకుని లాగించేస్తున్నారా..? అయితే ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌..

-

పీనట్‌ బటర్‌ విత్‌ బ్రెడ్‌ కాంబినేషన్‌ రెండు నిమిషాల్లో అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌.. ఇంకా టేస్టీ కూడా.. లైట్‌గా బ్రెడ్‌ను రోస్ట్‌ చేసి పీనట్‌ బటర్‌ రాసుకుని తింటే చాలు కడుపునిండిపోతుంది కూడా. హడావిడిగా ఆఫీసులకు వెళ్లేవాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువగా ఇవి తింటుంటారు. పీనట్‌ బటర్‌ తింటే కండపుష్టి వస్తుందని జిమ్‌కోచ్‌లు కూడా బాగా చెప్తారు. పిల్లలకు కూడా ఈ కాంబినేషన్‌ అంటే చాలా ఇష్టం.. పీనట్ బటర్ మితంగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయి. రోజుకో అరస్పూను చాలు. కానీ.. రోజూ రెండు, మూడు స్పూనులు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉందట..

పీనట్ బటర్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి అరస్పూను కన్నా ఎక్కువ బ్రెడ్‌పై వేసుకుని తినకూడదు.

పీనట్ బటర్‌‌లో ఒమెగా 6 అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి పరిమితంగా మాత్రమే అవసరం. కానీ అధికంగా ఒంట్లో చేరడం వల్ల శరీరానికి హనికరం. ఒమెగా 6 అనేది మన శరీరంలో ఉన్న ఒమెగా 3 కన్నా అధికంగా ఉండకూడదు. ఈ పరిస్థితి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

పీనట్ బటర్లో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిని తగ్గించడంలో ముందుంటుంది. ఈ రెండూ అదుపులో ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దీనిలో అధిక శాతంలో కొవ్వులు ఉంటాయి. వీటి వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. ఇది గుండెల్లో మంట కలిగిస్తుంది. ఈ కొవ్వులు అన్నవాహికలో చాలా అసౌకర్యానికి దారితీస్తాయి.

మితంగా తింటే ఇవే లాభాలు..

పీనట్ బటర్ రోజుకు అరస్పూను లేదా స్పూను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన నూనెలు లభిస్తాయి. దీన్ని తినడం వల్ల డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. అల్జీమర్స్ వ్యాధిని సైతం ఇది నిరోధిస్తుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిస్తుంది. అయితే అందరికీ పీనట్‌ బటర్‌ ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన పీల్చితేనే వామిట్‌ అనిపిస్తుంది. మరికొందరికి తింటే అలర్జీలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version