సమ్మర్ అని కూల్ వాటర్ తాగేస్తున్నారా..? ఒక్కసారి ఆలోచించండి బాస్..!

-

ఎండాకాలం మొదలైపోయింది.. భానుడు భగభగమంటున్నాడు.. ఇంట్లో ఉన్నా బయట ఉన్నట్లే అనిపిస్తుంది. మరీ ఈ టైంలో మనం తాగడానికి కచ్చితంగా ఫ్రిడ్జ్ వాటరే ఎంచుకుంటాం. అసలు బయటనుంచి రాగానే.. ఫ్రిడ్జ్ డోర్ తీసి.. ఒక లీటర్ కూల్ బాటిల్ తీసుకుని తాగితే.. అబ్బ.. ప్రశాంతంగా ఉంటుంది కదూ.. బయట ఎండనపడి వచ్చిన అలసట అంతా ఇట్టే పోతుంది. ఇక్కడ వరకూ సీన్ బానే ఉంది కానీ..ఈ అలవాటు అసలు మంచిది కాదుగా.. వేసవికాలం మనం అన్నీ కూల్ గా ఉండేవి తాగడానికే ఇష్టపడతాం. కూల్ డ్రింక్స్, కూల్ జ్యూస్, కూల్ వాటర్ ఇలా. కానీ ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, పరిష్కారం ఏంటి అనేది ఈరోజు చూద్దామా..!

ఫ్రిడ్జ్ లో పెట్టిన కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?

మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసులు కానీ 3-5 డిగ్రీల టెంపరేచర్ తో ఉంటాయి. మన శరీరం పొట్టలో ఉండే ఉష్ణోగ్రత 36 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. అంటే ఈ చల్లదానికి ఈ టెంపరేచర్ కు మాచింగ్ అవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. నోట్లో కూడా దాదాపు ఇదే టెంపరేచర్ మెయింటేన్ అవుతుంది. పళ్లు 1100 డిగ్రీల వేడిని అయినా తట్టుకోగలుగుతాయి కానీ.. చల్లదనాన్ని తట్టుకోలేవు. కూల్ ఐటమ్స్ వల్ల పళ్లనొప్పులు, ఎనామిల్ సమస్యలు వస్తాయి. నోట్లో రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే క్రిములను సగం నోట్లోనే హరించబడుతుంది. కూల్ ఐటమ్స్ వల్ల నోట్లో లాలాజం స్రవించదు. అన్నయావిక గొట్టం చివర స్పింటర్ అనే మూతలాంటిది ఉంటుంది. కూలింగ్ ఎఫెక్ట్ కు అది ముడుచుకుపోతుంది. ఆ గొట్టం తెరుచుకుంటేనే కదా.. ఆహారం పదార్థాలు కిందకు వెళ్తాయి.. కూలింగ్ వల్ల స్లోగా వెళ్తాయి. ఎక్కువ సేపు ఈ గొట్టంలో ఉండాల్సి వస్తుంది. ఇలా నిల్వ ఉండేసరికి..ఆహార పదార్థాల్లో ఉండే ఉప్పు,కారం, పులుపు, తీపి ఇలా అన్నీ గొట్టంలో ఇరిటేషన్ కలిగిస్తాయి. ఇంకా కూల్ వాటర్, డ్రింక్స్ తాగటం వల్ల శ్లేష్మాలు చిక్కబడతాయి. కఫం సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే కూల్ వాటర్ తాగటం వల్ల కొందరికి జలుబు చేస్తుంది. పొట్టకు కూడా కూల్ ఐటమ్స్ ప్రమాదమే.

పొట్టలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..?

మన పొట్టలో ఆహారపదార్థాలు అరగాలంటే.. హైడ్రోక్లారిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి. ఇది నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడే అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఉత్పత్తి అవ్వాలి. ఇలా పొట్టలో ఇవన్నీ ఉత్పత్తి అవ్వాలంటే 36 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడే అవుతుంది. మనం 3-5 డిగ్రీల టెంపరేచర్లో ఉండే కూల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడ ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ కు పైన చెప్పినవి ఉత్పత్తి అవ్వవు. దాంతో ఆహారపదార్థాలు అరగవు. నిల్వ ఉంటాయి. దానివ్లల పులుస్తాయి. అలా పులిస్తే. గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్ టెంపరేచర్ కు రావడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది.

కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినవి డైరెక్టుగా తినకుండా.. నార్మల్ టెంపరేచర్ కు వచ్చాకే తీసుకోవాలి. అవి తినేవి అయినా తాగేవి అయినా సరే.!

-Triveni Buskarowtu

Read more RELATED
Recommended to you

Exit mobile version