పుచ్చకాయ మన దప్పికను తీర్చడం తో పాటు మన ఆరోగ్యానికి అనేక లాభాలను చేకూరుస్తుంది.అలానే మనలో చాలా మంది పుచ్చకాయ తినేటప్పుడు అందులో ఉన్న గింజలను బయటకు పడేస్తూ ఉంటారు.
కానీ ఆ పుచ్చకాయ గింజలులోనే అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఈ విత్తనాలలో ఐరన్, కాపర్, మంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, విటమిన్స్, ప్రోటీన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి.
పుచ్చకాయ గింజలు జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతాయి.ఇందులోని కాపర్ జుట్టు పెరిగేందుకు సహాయపడే మెలనిన్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇవి వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఒత్తైన జుట్టును పెంచేందుకు సహాయపడుతాయి. వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
పుచ్చకాయ గింజలను మెత్తగా నూరి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా కాంతివంతమైన ముఖ వర్చస్సును పొందవచ్చు.ఇది మన చర్మానికి సహాయవంతమైన కాంతిని ఇవ్వడం తో పాటు చర్మంపై ఉన్న ముడతలను మరియు చర్మం పొడిబారే సమస్యలను తగ్గిస్తుంది.మధుమేహం ఉన్న వారికి పుచ్చకాయ గింజలు ఒక మంచి ఔషదం అని చెప్పవచ్చు.పుచ్చకాయ గింజలతో చేసే టీ ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తం లోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.అధిక రక్తపోటు సమస్యలను నివారిస్తుంది.ఇందులోని ఐరన్ రక్తహీనత సమస్యలను కూడా నివారిస్తుంది.
ఈ గింజల్లో ఉండే పాలి, మెనో అన్ శ్యాచ్చురేటడ్ ఫ్యాటి ఆమ్లాలు కోలేష్ట్రాలను తగ్గించడంతో పాటు, గుండెకు సంబందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.పుచ్చకాయ గింజలు యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువ కలిగి ఉన్నాయి.ఇది శరీరాన్ని ఫ్రీరాడీకల్స్ భారీ నుండి కాపాడుతుంది.ఇందులో ఉండే పోషకాలు ఖనిజాలాన్ని మరియు డి.న్.ఏ లను డ్యామేజీల నుండి కాపాడతాయి. కాబట్టి పుచ్చకాయను తినేటప్పుడు గింజలతో సహా తింటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.