కొంతమందికి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది కోపాన్ని అసలు కంట్రోల్ చేసుకోలేక పోతారు ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడుతూ ఉంటారు. మీకు కూడా ఎక్కువ కోపం వస్తూ ఉంటుందా అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు పాటించాలి. కోపం ఎక్కువగా వస్తున్నట్లయితే ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుడు కోపం నుండి ఈజీగా బయటపడొచ్చు. ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేయడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది చిరాకు బాగా తగ్గుతుంది కోపం కంట్రోల్ అవ్వాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లని కూడా చేయండి.
అలా బ్రీతింగ్ ఎక్ససైజ్ లను చేస్తే కూడా చక్కగా కోపం కంట్రోల్ లో ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదు. అయితే కోపం ఎందుకు వస్తుందనేది మీరు ఆలోచించుకోండి. వాటిని వీలైనంత వరకు ఒక పేపర్ మీద రాసుకోండి ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైతే మీరు ఎలా స్పందించాలో కూడా ప్లాన్ చేసుకోండి అలా ప్లాన్ చేసుకునే దానికి తగ్గట్టుగా మీరు రియాక్ట్ అయ్యారంటే కోపానికి గురవ్వరు. కోపంతో చాలామంది ఏవేవో మాటలు అంటూ ఉంటారు అయితే మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. ఎలాంటి చింతా ఉండదు.
శారీరక వ్యాయామం చేయడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది కోపానికి కారణం అయ్యే ఒత్తిడి వ్యాయామం చేయడం వలన తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు కొంచెంసేపు వ్యాయామం చేస్తూ ఉండండి. ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకి కోపం బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేసేటప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి. అలానే కోప్పడిన తర్వాత ఎవరితో అయితే కోప్పడ్డారో వాళ్ళతో కూర్చుని శాంతంగా మాట్లాడండి ఇలా మీరు పాటించినట్లయితే కచ్చితంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.