బుల్లితెర మెగాస్టార్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

-

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామోజీరావు ఫిలిం సిటీ లో మొదట మెజీషియన్ గా తన కెరియర్ ను ఆరంభించి ఆ తర్వాత కొంతమంది సహాయంతో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ పలు కామెడీ షోలలో తన కామెడీతో ప్రేక్షకులను అలరించి.. ఢీ వంటి డాన్స్ షోలకి హోస్టుగా కూడా వ్యవహరించారు. ముఖ్యంగా రష్మీ తో కలిసి ఈయన నడిపిన ప్రేమాయణం ప్రతి షోకి హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.

బుల్లితెరపై కమెడియన్ గా, బుల్లితెర మెగాస్టార్ గా భారీ పాపులారిటీ అందుకున్న సుదీర్ ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటడానికి పయనమయ్యాడు. అలా మొదట సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత గాలోడు సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించిన సుధీర్ కు ఈసారి పక్కా హిట్టు లభించిందని చెప్పాలి. ఇప్పుడు GOAT సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు బుల్లితెర మరొకవైపు వెండితెర అంటూ రెండు చేతుల బాగానే సంపాదిస్తున్న సుదీర్ ఇప్పటివరకు ఎంత ఆస్తి కూడబెట్టారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ .3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సుధీర్ మొత్తంగా రూ .25 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాదులో ఒక విలాసవంతమైన ఇంటితోపాటు రెండు బైకులు, ఒక ఖరీదైన కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన సంపాదనతో పొలాలు కూడా కొన్నారట. మొత్తానికి అయితే సుధీర్ భారీగానే సంపాదించాడని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news