మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా..? వీటిని పెట్టండి..!!

-

చిన్నప్పుడే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి.. లేకపోతే.. సరైన విధంగా ఎత్తు, బరువు ఉండవు.. పెద్దయ్యాక బరువు పెంచుకోవచ్చు కానీ.. ఎత్తును మాత్రం పెంచుకోలేరు.. కాబట్టి.. తల్లిదండ్రులు వారి పిల్లల ఎత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సాధారణం కంటే.. తక్కువగా మీ పిల్లలు తక్కువగా ఎత్తు ఉన్నట్లు అనిపిస్తే.. ఏమాత్రం ఆందోళన చెందకుండా.. కొన్ని ఆహారాలను వారి డైట్‌లో చేర్చండి. నిజానికి ఎత్తు పెరగకపోవడానికి..జన్యుపరమైన కారణాలు కూడా అవ్వొచ్చు. వీటిని పక్కపపెడితే.. ఎలాంటి ఆహారం ఇవ్వడం వల్ల హైట్‌ పెరుగుతారో ఇప్పుడు చూద్దామా..!

సాధారణంగా ఎత్తు పెరగడానికి కాల్షియం అవసరం అవుతుంది. ఇది సోయా ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. ఎత్తు పెరగాలనుకునేవారు సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. సోయా బీన్స్‌, సోయా మిల్క్‌ను రోజూ పిల్లలకు ఇస్తే వారు ఎత్తు పెరుగుతారు.

పాలలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎత్తు పెరిగేందుకు చాలా సహాయ పడుతుంది. రోజూ పిల్లలకు ఒక గ్లాస్‌ పాలను ఇవ్వాలి. దీంతో వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు.

మాంసాహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలకు ఇస్తే అవి వారికి అందుతాయి. దీంతో వారు సరైన రీతిలో ఎత్తు పెరుగుతారు. కోడిగుడ్డులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. పిల్లలకు రోజుకు ఒక గుడ్డును తినిపిస్తే వారు త్వరగా ఎత్తు పెరుగుతారు.

బెండకాయలు కూడా పిల్లల్లో ఎత్తును పెంచేందుకు దోహదపడతాయి. వీటిల్లో విటమిన్లు, ఫైబర్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. కనుక వీటిని పిల్లలకు తరచూ తినిపిస్తుంటే వారు ఎత్తు పెరుగుతారు.

పిల్లల ఎత్తును పెంచేందుకు బచ్చలికూర, పాలకూర వంటివి కూడా తోడ్పడుతాయి. వీటిల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.

వీటితో పాటు పిల్లలు ఆడుకోవాలి. ఇండోర్‌ గేమ్స్‌ కాకుండా.. ఔట్‌ డోర్‌ గేమ్స్‌పై పిల్లలు ఎక్కువ సమయం కేటాయిస్తే.. అది వారి ఆరోగ్యానికి కూడా మంచిది..! కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలకు పైన చెప్పిన డైట్‌ను వారి ఆహారంలో చేర్చండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version