ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమే..!

-

ఎప్పుడైతే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటారో పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా మంచి పోషకాలు ఉండేటివంటి ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే కొన్ని ఆహార పదార్ధాలను అధికంగా తీసుకోవడం వలన శరీరంలో విషం చేరినట్టే అని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు సరైన మోతాదులో తీసుకోవాలి. చాలా శాతం మంది అనారోగ్య లక్షణాలను గుర్తించకుండా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. దాని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఎప్పుడైతే కొన్ని రకాల ఆహారాలను తక్కువ మోతాదులో తీసుకుంటారో, ఆరోగ్యం పై ప్రభావం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆకుపచ్చ బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వలన శరీరంలో విషం చేరినట్టే అని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఉండే సోలోనిన్స్ విషాన్ని పోలి ఉంటాయి. దాని వలన తలనొప్పి, కడుపునొప్పి, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి. సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. పైగా, గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. అయితే, బాదం పప్పులో తీపి బాదం మరియు చేదు బాదం ఉంటాయి. తీపి బాదం పప్పును తినడం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. కాకపోతే చేదు బాదంపప్పును తింటే ఆరోగ్యం పై చాలా ప్రభావం ఉంటుంది.

ఈ మధ్యకాలంలో వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను చాలా మంది తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ మోతాదులో బ్రౌన్ రైస్‌ను తీసుకోవడం వలన శరీరానికి విషం అందిస్తున్నట్లు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే గుణాలు క్యాన్సర్‌కు దారితీస్తాయి. అందువలన బ్రౌన్ రైస్‌ను ఉపయోగించినప్పుడు కనీసం 5 నుండి 6 సార్లు వరకు మంచి నీటితో శుభ్రంగా కడిగి నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. సహజంగా జాజికాయను ఎక్కువగా మసాలా దినుసులాగా ఉపయోగిస్తారు. అయితే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎప్పుడైతే జాజికాయను ఎక్కువగా తీసుకుంటారో నాడీ వ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. దీంతో అలసట, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక, దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడమే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news