ఈరోజుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పుల నుంచి బయటపడడానికి చూసుకోవాలి. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నా ఆహారాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలని అస్సలు తీసుకోకూడదు. మరి మీకు కూడా కీళ్లనొప్పులు ఉన్నాయా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకొని ఫాలో అవ్వండి. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇందులో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండడం వలన కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువ అవుతాయి.
ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళు చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి. వీటి వలన కూడా ఎక్కువగా నొప్పులు వస్తాయి. షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కీళ్ల నొప్పులు పై ప్రభావం పడుతుంది. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
సోయా కూడా తీసుకోకూడదు. సోయా తీసుకోవడం వలన నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మరీ ఎక్కువగా తీసుకోవడం వలన కొంత మందిలో ఇది ఎలర్జీని కలిగిస్తుంది కీళ్ల నొప్పులని కూడా పెంచుతుంది. కాబట్టి వీటన్నిటికి దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది సరైన మెడికేషన్ ద్వారా కీళ్ల నొప్పుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు.