కొడుకుతో కలిసి స్టార్ హీరో డబ్బింగ్.. పిక్స్ వైరల్!

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితుడు సుధీర్ బాబు గురించి తెలియని వారుండరు.ప్రేమ్ కథా చిత్రమ్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బానవ్వించారు. ఆ తర్వాత హీరో నానితో కలిసి ‘వి’ చిత్రంలో పోలీస్ రోల్‌లో పవర్ ఫుల్ రోల్ ప్లే చేశారు. సుధీర్ బాబు చిత్రాల్లో మంచి కథనం ఉంటుంది. తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తన కొడుకుతో కలిసి ఉన్న ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశారు. అందులో తన కొడుకు చరిత్ మానస్‌తో కలిసి ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీకి డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. నాన్న సెంటిమెంట్ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి తండ్రికొడుకులు ఇలా ఇద్దరూ డిఫరెంట్‌గా ప్రమోట్ చేసారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరిత్ మానస్ గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. రానున్నరోజుల్లో హీరోగా లాంచ్ అవుతాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version