చర్మ సమస్యల నుండి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడం వరకు ఉల్లి తొక్కలతో ఎన్నో లాభాలు…!

-

మన భారతీయ వంటల్లో వివిధ కూరగాయలతో పోలిస్తే ఉల్లిపాయల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉల్లి తొక్కల్ని కనుక పడేయకుండా ఉంచి వాటిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. ఉల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..!

చర్మాన్ని సంరక్షిస్తుంది:

ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల అలర్జీలు తొలగిపోతాయి. దీనికోసం ఉల్లి తొక్కలని నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటితో ఉదయాన్నే ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలు తగ్గిపోతాయి. కొద్ది రోజుల్లోనే మీకే మార్పు కూడా కనిపిస్తుంది.

ముఖంపై స్పాట్స్ ను తగ్గిస్తుంది:

ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల ముఖం మీద స్పాట్స్ కూడా తొలగిపోతాయి. ఉల్లి తొక్కల్ని పేస్టులాగ చేసి స్పాట్స్ మీద అప్లై చేయండి. వెంటనే మీకు స్పాట్స్ తొలగిపోతాయి.

వంటకి రుచి ఇస్తుంది:

ఉల్లి తొక్కల్ని వేయించి వాటిని పొడి చేయండి. ఈ పొడిని మీరు చేసే వంటలు ఉపయోగిస్తే మంచి రుచి వస్తుంది.

గొంతు కి మంచిది:

మీకు గొంతు గరగర అలాంటివి ఏవైనా ఉంటే నీళ్ళలో ఉల్లి తొక్కలను వేసి మరిగించండి. దీనిని వడకట్టి ఆ నీళ్ళను తాగండి. దీంతో గొంతు సమస్యలు తగ్గిపోతాయి.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

దీని కోసం మీరు ఉల్లి తొక్కల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగండి. రుచి నచ్చకపోతే కొంచెం తేనె లేదా పంచదార దానిలో కలుపుకోవచ్చు. ఇలా కనుక మీరు తాగారు అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

జుట్టు సిల్కీగా అవ్వడానికి:

ఉల్లి తొక్కలు నీళ్ళని జుట్టుకు ఉపయోగించారు అంటే జుట్టు సాఫ్ట్ గా ఉండడమే కాక మీ జుట్టు మెరుస్తుంది కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version