తళతళల మెరిసే దంతాల కోసం పాటించాల్సిన ఇంటి చిట్కాలు..

-

తెల్లని మెరిసే దంతాలు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. అందుకే తెల్లని దంతాల కోసం ఆరాటపడుతుంటారు. కానీ మన ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు పసుపు రంగులోకి మారతాయి. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దంతాలపై ఉన్న పసుపు రంగుని పోగొట్టడానికి రకరకాల టూత్ పేస్టులు వాడి ఉంటారు. ఏదీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదని బాధపడుతున్నారా? ఐతే దంతాల తెల్లదనం కోసం పాటించాల్సిన కొన్ని ఇంటిచిట్కాలని ప్రయత్నించండి.

 

కొబ్బరి నూనె

కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని నోటితో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రంగా నోటిని కడుక్కోవాలి. ఇలా కాదనుకుంటే టూత్ బ్రష్ మీద కొన్ని చుక్కల కొబ్బరి నూనె ను పోసుకోవాలి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎసిటికామ్లం వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు బాక్టీరియాను చంపేస్తాయి. మీ దంతాలపై ఆపిల్ సైడర్ వెనిగర్ ని రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి.

నిమ్మ తొక్క

నిమ్మతొక్కలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి శరీరానికి ఎంత మేలు చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్లు దంతాలపై ఉన్న మురికి తొలగించడంలో కీలక పాత్ర వహిస్తాయి. నిమ్మతొక్కని దంతాలపై రుద్దాలి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలోని లక్షణాల వల్ల దంతాలపై మురికి తొలగిపోతుంది. దీనికోసం నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి, ఆ తర్వాత ఆ నీటిని టూత్ పేస్టు మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ళపై ఉన్న పసుపుదనం తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version