ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీ, వైసిపి పోటా పోటీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ నూజివీడు మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలోనే… టీడీపీ వారితో టచ్ లోకి 8 మంది వైసీపీ కౌన్సిలర్లు వెళ్లారు. హైదరాబాద్ లో టీడీపీ క్యాంప్, భద్రాచలం లో వైసీపీ ఆధ్వర్యంలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి.
మొత్తం 32 స్థానాల్లో 8 టీడీపీకి ఉన్నాయి. వైసిపి నుంచి 8 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కలవడంతో టీడీపీకి ఆధిక్యంలోకి వచ్చింది. అటు భద్రాచలం క్యాంప్ కి తరలించిన వైసిపి కౌన్సిలర్లు కూడా టీడీపీ మంత్రి సారథి కి టచ్ లో కి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా