బ్లాక్ కాఫీ వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తీసుకుంటారు..!

-

ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ మరియు టీ వంటి వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే చాలా శాతం మంది ప్రతిరోజూ బ్లాక్ కాఫీను తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని వాటిని తీసుకుంటూ ఉంటారు. దీనిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. బరువు తగ్గడం కోసం మరియు కేలరీలను తక్కువ తీసుకోవాలి అనుకునేవారు బ్లాక్ కాఫీ ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే బ్లాక్ కాఫీలో చాలా శాతం కెఫైన్ ఉంటుంది. బ్లాక్ కాఫీ ఎంతో త్వరగా ఎనర్జీ ను ఇస్తుంది, కాకపోతే ఒక కప్పు బ్లాక్ కాఫీలో 95 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది.

అయితే బ్లాక్ టీ లో కేవలం 26 నుండి 48 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ ఉంటుంది. అందుకే చాలా మంది ఏకాగ్రత ను పెంచుకోవడానికి, వెంటనే ఎనర్జీ ను తెచ్చుకోవడానికి బ్లాక్ కాఫీను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కేవలం ఉదయం సమయంలో మాత్రమే కాకుండా ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, మెలకువగా ఉండాలి అన్నప్పుడు బ్లాక్ కాఫీ ను తప్పకుండా తీసుకుంటారు. బ్లాక్ కాఫీ లో ఎలాంటి పంచదార లేక క్రీమ్ వంటి వాటిని ఉపయోగించకుండా తయారు చేస్తారు. అందుకే బరువు తగ్గడానికి ఈ కాఫీను చాలా శాతం మంది తీసుకుంటారు.

టీ లో కూడా తక్కువ క్యాలరీలు మాత్రమే ఉంటాయి, కాకపోతే టీ తాగేవారు తప్పకుండా పంచదార, పాలు లేక తేనే వంటి వాటిని ఉపయోగిస్తారు. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దాని వలన ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని తగ్గించి డయాబెటిస్, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం బ్లాక్ కాఫీ ను తీసుకున్న వారు చాలా ఏకాగ్రతగా ఉంటారు మరియు వారి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉన్నాయి అని తేలింది. అంతేకాకుండా ప్రతిరోజు బ్లాక్ కాఫీ ను తీసుకోవడం వలన అల్జీమర్స్ వంటి సమస్యలను చెక్ పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news