బియ్యం కడిగిన నీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో పోషకాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇది శరీరం తో పాటు అందానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది. మనం దీనిని ఎక్కువగా ఉపయోగించం కానీ జపాన్, దక్షిణ కొరియా లో వీటిని దాచుకుని మరీ ఉపయోగిస్తారు. మరి దీని వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… ముందు బియ్యాన్ని కడిగినప్పుడు ఎక్కువగా దుమ్ము లాంటిది ఉంటుంది.
కనుక వాటిని ఉపయోగించకండి. ఇది అంతా శుభ్రం అయ్యాక అంటే.. రెండవ సారి కడినప్పుడు ఆ నీటిని మాత్రం దాచుకుని ఉపయోగించండి. ముందు ఈ నీటిని తీసుకుని ఫ్రిజ్ లోని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేయాలి. ఆ ట్రేలో నీరు గడ్డకట్టి క్యూబ్ లాగా మారుతుంది. ఈ క్యూబ్స్ ని స్నానానికి వెళ్లే పది నిమిషాల ముందు ముఖం పై రుద్దండి. దీనితో మీ ముఖం మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పద్ధతిని మీరు ఫాలో అయితే ఎలాంటి క్రీములు,కాస్మెటిక్స్ ని కొనాల్సిన పనే లేదు.
ఈ నీటిని మేకప్ వేసుకునే ముందు క్లెన్సింగ్ లాగ కూడా వాడొచ్చు. కేవలం దీనికే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని కుదుళ్లలో పట్టించి, మునివేళ్ల తో మార్ధనా చేయాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలే సమస్య ఉండదు. చూసారా మనం పడేసే బియ్యం నీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..! మరి ఈ అద్భుతమైన చిట్కాని పాటించి ఈ సమస్యలకి ఎంతో సులువుగా చెక్ పెట్టేయండి.