కనీసం తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడానికి అవ్వట్లేదు. అలాంటిదే కథలు చెప్పడం ఎక్కడ కుదురుతుంది…? కానీ చిన్నపిల్లలకు నిద్రపోయేటప్పుడు కథలు చెప్పడం మంచిది. పిల్లలకి నిద్ర పోయేటప్పుడు కథలు చెప్పడం వలన ఏమవుతుంది..? ఏమైనా లాభం ఉంటుందా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో పెద్దవాళ్ళు పిల్లలకు కథలు చెప్పే వాళ్ళు. రాత్రి కథలు వింటూ చిన్నపిల్లలు నిద్రపోయే వాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు, ఇతర కారణాల వలన పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య బాండింగ్ బాగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోతున్నారు. పిల్లలకు కథలు చెప్పట్లేదు.
అయితే, నిజానికి పిల్లలకి కథలు చెప్పడం వలన విలువలు పెరుగుతాయి. కథల్లో మంచిని వాళ్ళు బలంగా మెదడులోకి తీసుకుంటారు. మంచి మంచి కథలు వినడం వలన వాళ్లలో మంచితనం పెరుగుతుంది. దయాగుణం ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళలో పెరుగుతుంది. అలాగే పిల్లలకి కథలు చెప్పడం వలన బంధాలు బలపడతాయి. కథలు చెప్తూ వాళ్లతో సమయాన్ని గడిపితే వాళ్ల మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎమోషనల్ కనెక్షన్ కూడా ఎక్కువవుతుంది.
అలాగే పిల్లలకి కథలు చెప్పడం వలన ఎక్కువగా ఫాంటసీలు ఉంటాయి. కొన్ని కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు పరిస్థితుల గురించి కథల్లో ఉంటాయి. అవి చెప్పేటప్పుడు వాళ్ళకి ఇమేజినేషన్ శక్తి ఎక్కువ అవుతుంది. అలాగే వాళ్ళల్లో సృజనాత్మకత కూడా ఎక్కువవుతుంది. కథలు చెప్పడం వలన కొత్త పదాలు, భాష పై పట్టు వస్తుంది. అలాగే కథలు వలన ఒత్తిడి తగ్గుతుంది రిలాక్స్ అవ్వడానికి అవుతుంది. నిద్ర పట్టడానికి కూడా కథలు బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలకి రాత్రిళ్ళు కథలు చెప్పడం మంచిది.