చాలామందికి స్ట్రెస్, ఆందోళన కలిగినప్పుడు గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు, మన శరీరం మనకి పంపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక. నిరంతరం గోళ్లు కొరకడం అనేది మనసులో ఉన్న ఒత్తిడి, భయం, లేదా ఆందోళనకు సంకేతం. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు కొంత ఉపశమనం కోసం ఈ చర్యను ఎంచుకుంటుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. గోళ్లు కొరకడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కలుగుతాయి. ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం ..
బాక్టీరియా, ఇన్ఫెక్షన్లు: గోళ్ల కింద చాలా బాక్టీరియా ఉంటుంది. గోళ్లు కొరకడం వల్ల ఆ బాక్టీరియా మన నోట్లోకి వెళ్లి జీర్ణ సమస్యలను, ఇతర ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. దీంతో డయేరియా వంటి అనారోగ్యాలు కూడా రావచ్చు.
దంత సమస్యలు: గోళ్లు కొరకడం వల్ల పళ్లపై ఒత్తిడి పడి, అవి బలహీనపడతాయి. పళ్లు అరిగిపోవడం, పగిలిపోవడం లేదా దంతాల మధ్య ఖాళీలు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. ఇది నోటి పరిశుభ్రతకు కూడా మంచిది కాదు.
గోళ్లకు శాశ్వత నష్టం: తరచుగా గోళ్లు కొరకడం వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం, గోళ్లు పెరిగే భాగం దెబ్బతింటాయి. దీనివల్ల గోళ్లు పగిలిపోవడం, సరిగా పెరగకపోవడం లేదా వాటి ఆకారం పూర్తిగా మారిపోవడం వంటివి జరుగుతాయి.
ఈ అలవాటును మానుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం ..

స్ట్రెస్ తగ్గించుకోండి: గోళ్లు కొరకడానికి ప్రధాన కారణం స్ట్రెస్.ఎక్కువగా యువత ఎగ్జామ్స్ టైం లో ఇలా గోర్లు కొరకటం మనం చూస్తాము. కాబట్టి వారిలో స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, వ్యాయామం లేదా నచ్చిన హాబీ ను అలవాటు చేసుకోవాలి.
నెయిల్ కేర్: గోళ్లను చిన్నగా కత్తిరించుకోండి. గోరు కొరకాలనిపించినప్పుడు నెయిల్ పాలిష్, చేతికి గ్లవ్స్ లేదా చేతికి చేతి తొడుగులు ధరించడం వంటివి ప్రయత్నించవచ్చు.
ఈ అలవాటు ఎక్కువగా ఉండి, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే, నిపుణుడైన సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఈ అలవాటును మానుకోవడం కష్టమే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అధిగమించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.