తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయానికి పైనే పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 27,728 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది.

మరోవైపు నిన్న తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఈరోజు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీంతో భక్తులు తిరుమలలో తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉన్నవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నిన్నటి నుంచి తిరుమలలో మోస్తారు వర్షాలు కురిసాయి. మరో రెండు మూడు రోజులపాటు తిరుమలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు.