చాలా మంది ఏదైనా బిజినెస్ ని చేయాలని అనుకుంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి రాబడి వస్తుంది. పైగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది.
అలానే పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు కూడా రైతులకు నేరుగా కేంద్రం ఇస్తోంది. కొన్ని రకాల లోన్స్ ద్వారా కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టె అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే వ్యవసాయం ద్వారా లక్షల్లో సంపాదించాలని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఐడియా. అదే నల్ల బియ్యం.
నల్ల బియ్యం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పోషక పదార్థాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ కూడా రోజు రోజుకీ దీనికి పెరుగుతోంది. రక్త పోటు వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. సిక్కిం, మణిపూర్, అస్సాం లో ఎక్కువగా దీనిని సాగు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడిప్పుడే సాగు ప్రారంభం అవుతోంది. సాధారణ బియ్యం కంటే కూడా దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పంట చేతికి రావడానికి 100 నుండి 110 రోజులు పడుతుంది. ఈ వరిని తక్కువ నీరు ఉన్న ప్రదేశంలో కూడా పండించవచ్చు. నల్ల బియ్యం తో సాధారణ బియ్యం కంటే ఐదు వందల రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు.
సాధారణ బియ్యం కిలో 30 నుంచి 60 రూపాయలు విక్రయిస్తారు. అయితే నల్లబియ్యం మాత్రం 100 నుండి 150 వరకు విక్రయిస్తారు. అంటే ఎంత లాభమో ఒకసారి చూడండి. కనుక ఈ విధంగా ఈ బిజినెస్ ఐడియాని అనుసరించి బిజినెస్ చేశారు అంటే కచ్చితంగా అద్భుతమైన రాబడి వస్తుంది.