ఈమధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అందరిలోనూ పెరిగింది. కల్తీ, కాలుష్యం ఎక్కువైన ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. తినే ఆహారం దగ్గర నుంచి వండే పాత్రల వరకు ఆరోగ్యం గా ఉంచడంలో దేని పాత్ర దానిది. వెనుకటి రోజుల్లో ఆహారాన్ని మట్టి, రాగి, ఇత్తడి పాత్రలను వంట చేయడానికి ఉపయోగించేవారు. అప్పటి వారు నేటి తరం వారితో పోలిస్తే చాలా ఆరోగ్యం గా ఉండేవారు.
మాటిమాటికీ అనారోగ్య సమస్యలతో ఉండేవారు కాదు. దానికి వారి ఆహారపు అలవాట్లు ఒక కారణం అయితే, వారు వండే విధానం కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. వంట చేయడానికి ఉపయోగించే పాత్రలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు ఎంటో. వీటిలో వండితే ఉండే పోషక విలువల ఎంత వరకు అందుతాయి తెలుసుకుందాం.మట్టి పాత్రలో వండటం వల్ల 100 శాతం పోషకాలు లభిస్తాయి.
కంచు పాత్రలో వంట చేయడం వల్ల 97 శాతం వరకు పోషకాలు అందుతాయి, ఇకపోతే ఇత్తడి పాత్రలు వంటకు ఉపయోగించడం వల్ల 93 శాతం వరకు పోషకాలు అందుతాయి. అల్యూమినయం పాత్రలు, ప్రెషర్ కుక్కర్ లో 7 శాతం లేక 13 శాతం వరకు మాత్రమే పోషకాలు లభిస్తాయి.కాబట్టి మన మందరము ఇత్తడి, రాగి లేక మట్టి పాత్రలను వాడి తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాము.