ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవన విధానానికి మనిషి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. బిజీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాలవల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక చాలామంది నరాలకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల నరాలు బలహీనమై, రక్తం నరాల్లో నిలిచిపోయి, గుండెకు సరఫరా సరిగా అవ్వకుండా, పైకి ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యని వెరికోస్ వీన్స్ అంటారు. ఇలా కాళ్ళ నరాలు ఉబ్బడం,దాని కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు గురించి మనం చూద్దాం..
వెరికోస్ వీన్స్ అనేది కాళ్లలో నరాలు వాచిపోయి ఉబ్బినట్లు కనిపించడం. ఇలా కనిపిస్తే మీ శరీరంలో బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వట్లేదు అని అర్థం. ఇది మగ, ఆడ తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల నరాలు బలహీనమై ఆ నరాలలో రక్తం నిలిచిపోయి, నీలం రంగు లేదా ఉదా రంగుతో నరాలు మారిపోతాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు: వెరికోస్ వీన్స్ కు పలు కారణాలు ఉన్నాయి, దీర్ఘకాలం నిలబడి లేదా కూర్చోవడం, ఊబకాయం, హార్మోన్ల మార్పుల వల్ల, జన్యుపరమైన సమస్యల వలన ఈ నరాల ప్రాబ్లం రావచ్చు. మోనోపాజ్ వంటి దశలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యి ఇటువంటి సమస్యలకు దారితీస్తాయి. వృద్ధాప్యంలో రక్తనాళాలు బలహీనంగా ఉండడం సిరలు ఉబ్బటానికి కారణం అవుతాయి.
లక్షణాలు: కాళ్లలో నరాలు ఉబ్బడంతో పాటు నొప్పి, బాధగా అనిపించడం. కాళ్ళు బరువుగా మారిపోతాయి దురద, వాపు, చర్మం రంగు మారడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి చర్మం పై పుండ్లు ఏర్పడతాయి. వీటిలో ఎలాంటి లక్షణం కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.
నివారణ చర్యలు: వెరికోస్ వీన్స్ ను నివారించడానికి మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజు వ్యాయామం చేయడం, బరువుని నియంత్రించడం, ఎక్కువసేపు నిలబడకుండ, కూర్చోవటం కాళ్ళను ఎత్తి ఉంచడం, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సాక్స్ ధరించడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆహారంలో ఫైబర్ విటమిన్ సి, అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం రక్తనాళాల లో బలం ఏర్పడుతుంది.
కాల నరాలు ఉబ్బడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య కాదు. రక్తం కాళ్లలో నిలిచిపోయి గుండెకు సరిగా వెళ్లట్లేదని అర్థం. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. సకాలంలో గుర్తించి ఆహారంలో మార్పులు చేసుకొని వైద్య సలహాతో నియంత్రించవచ్చు.
(గమనిక : పైన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే,ఇటువంటి లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించండి.)