తమ్ముడికి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి… నన్ను అడగకండి అంటూ !

-

తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం నా చేతుల్లో లేని విషయం.. దాని గురించి రేవంత్ రెడ్డిని అడగండి అని చురకలు అంటించారు.

komatireddy venkat reddy rajagopal reddy
komatireddy venkat reddy rajagopal reddy

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది నాకు సంబంధం లేని అంశం అని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా స్వార్థం నాది.. నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి అని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదు అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news