డయబెటీస్‌ ఉన్న వాళ్లు రక్తదానం చేయొచ్చా..?

-

అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అంటారు. అన్నదానం ఒక మనిషి ఆకలిని తీరుస్తుంది. అలాగే రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది. రక్తదానం కూడా గొప్పదే. అయితే ఎవరు పడితే వాళ్లు రక్తం ఇవ్వడానికి లేదు, రక్తదానం ఇవ్వడానికి కూడా కొన్ని కండీషన్స్‌ ఉంటాయి. ఎవరు రక్తం ఇచ్చేందుకు అర్హులు, ఎవరు రక్తదానం చేయకూడదు అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

మధుమేహం ఉన్నవారు రక్తదానం చేయరాదని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే వాళ్లకు అప్పటికే రక్తంలో చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వారు రక్తదానం చేయడం వల్ల వారి రక్తాన్ని స్వీకరించిన గ్రహీతలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, అందువల్ల వారు కూడా మధుమేహం వ్యాధిని పొందుతారు అని చాలా మంది బలంగా నమ్ముతారు. కానీ, ఇది పూర్తిగా అవాస్తవం అని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు కూడా నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చు. ఎందుకంటే, మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఇది రోగి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కాని రక్తాన్ని కాదు. కాబట్టి డయాబెటీస్ ఉంటే రక్తదానం చేయకూడదు అనేది అపోహ మాత్రమేనని వైద్యులు అంటున్నారు.

మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచినంత కాలం రక్తదానం చేయవచ్చునని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇన్సులిన్ తీసుకునే వారు, మధుమేహంతో పాటు రోగికి గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు అలాగే ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్లను కలిగి ఉంటే అలాంటి సందర్భాల్లో వారు రక్తదానం చేయకూడదని వైద్యులు అంటున్నారు.

రక్తదానం చేసేందుకు ఎవరు అర్హులు

18 నుండి 60 సంవత్సరాల వయసు, కనీసం 50 కేజీల బరువు ఉన్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు.

రక్తదానం ఎవరు చేయకూడదు

జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, జలుబు పుండ్లు, కడుపులో పుండ్లు లేదా ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు.
రక్తహీనత కలవారు చేయకూడదు

ఇటీవల పచ్చబొట్లు, టాటూలు పొడిపించుకుంటే, 6 నెలల వరకు రక్తదానం చేయలేరు.

దంత చికిత్స తీసుకుంటే 24 గంటల వరకు రక్తదానం చేయరాదు

తల్లిపాలు ఇచ్చే సమయంలో రక్తదానం చేయడం మంచిది కాదు.

అసురక్షిత శృంగారంలో పాల్గొన్నవారు కనీసం ఏడాది పాటు రక్తదానం ఇవ్వడానికి నిషేదం

HIV (AIDS వైరస్) నిర్ధారణ అయిన వారు శాశ్వతంగా రక్తదానం చేసేందుకు నిషేధం

అలాగే డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకున్న వారు కూడా రక్తదానం చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version