అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల సంగీత వేడుక..బాలీవుడ్ ప్రముఖుల సందడి

-

ఆనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల సంగీత వేడుక నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. జియో సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్‌ల సంగీత వేడుకకు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్,ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.

సంగీత పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లా వైరల్ గా మారాయి. తాజాగా సల్మాన్ ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.సంగీత్ పార్టీకి చెందిన సల్మాన్ ఖాన్ వీడియో వైరల్ అవుతోంది. త్వరలో తండ్రి కాబోతున్న రణ్‌వీర్ సింగ్ ఢోలక్‌పై కూర్చుని పార్టీని ఎంజాయ్ చేశాడు.ఆకాష్ అంబానీ, అనంత్‌లతో కలిసి సల్మాన్ కూడా ఉన్నాడు. పక్కనే నిలబడి క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా డ్యాన్స్ లో లీనమైపోయాడు. ‘ముంబయిలో జరిగిన సంగీత వేడుకలో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ,హార్దిక్ పాండ్యాతో కలిసి జుమ్మే కీ రాత్‌లో అనంత్ భాయ్.. ఆకాష్ అంబానీ’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version