కాళోజి రాసిన బుక్‌ను చంద్రబాబుకు బహుకరించిన రేవంత్ రెడ్డి

-

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు వచ్చిన టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు.తెలంగాణ ప్రముఖ కవి కాళోజి రాసిన ”నా గొడవ” బుక్‌ను సీఎం రేవంత్ చంద్రబాబుకు బహుకరించారు. కాగా, నిజాంల కాలం నుండి 1980 వరకు జరిగిన పాలనతో పాటు నిజాం, బ్రిటిషర్ల పాలన మధ్య తేడాలపై కాళోజి ఈ పుస్తకంలో వివరించారు. దీంతో పాటుగా ఏళ్ల తరబడి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమాల గురించి అనేక అంశాలను ఈ పుస్తకంలో కాళోజి ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కాళోజి నా గొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గిఫ్ట్‌గా చర్చనీయాంశంగా మారింది.

కాగా.. సుదీర్ఘ కాలంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తరుఫున చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు జనార్ధన్ రెడ్డి,అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version