ఆ స్థానాల్లో గెలుపు బాధ్యత రేవంత్‌దే..అదిరే హామీలు.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. పార్టీ అనేక ఒడిదుడుకులని ఎదురుకుంటున్న వెనక్కి తగ్గకుండా..పార్టీలో అంతర్గత సమస్యలని చల్లార్చి..మళ్ళీ పార్టీని రేసులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ రాజకీయ యుద్ధంలో అనూహ్యంగా బి‌జే‌పిని వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది.

తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండుసార్లు ఓటమి పాలై..అధికారాన్ని కోల్పోయింది.కానీ ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఈ సారి పార్టీ గెలుపు బాధ్యతలనీ తానే స్వయంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలిపించే బాధ్యత తనదే అని రేవంత్ ప్రకటించారు. తాజాగా ఆదిలాబాద్‌కు చెందిన పలువురు నేతలని కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆయన..ఆదిలాబాద్‌కు బి‌ఆర్‌ఎస్ చేసిందేమి లేదని, కాంగ్రెస్ పార్టీని 8 సీట్లలో గెలిపించాలని, ఆదిలాబాద్‌ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు.

ఇక కర్నాటకలో ఇచ్చిన హామీల మాదిరిగానే తెలంగాణలో కూడా కొన్ని కీలక హామీలని రేవంత్ ప్రకటించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు, రూ.5 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఇలా కీలక హామీలని రేవంత్ ప్రకటించారు.

అయితే ఇవి ప్రజాకర్ష హామీలే అని చెప్పాలి. ఇవి ఎన్నికల్లో ఎంతవరకు కాంగ్రెస్‌కు మేలు చేస్తాయో చూడాలి. అలాగే 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ గెలిపించగలరా? లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version