పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా..మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి.పశ్చిమ బెంగాల్- 4, హిమాచల్- 3,ఉత్తరాఖండ్- 2,బీహార్- 1, తమిళనాడు- 1, పంజాబ్- 1, మధ్యప్రదేశ్- 1 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న రిలీజ్ అయింది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగియాగా జూన్ 24న పరిశీలన ,జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. వాటి ఫలితాలు ఈనెల13న వెలుపడతాయి.