ఐదు నిమిషాలలో ఇలా రోగ నిరోధక శక్తిని పెంచుకోండి..!

-

  • ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం మంచిది. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ విధంగా పాటిస్తే సులువుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే రోగ నిరోధక శక్తిని పెద్దగా కష్టపడక్కర్లేదు. న్యాచురల్ విధానంలో పాటిస్తే సరిపోతుంది.

ఇక్కడ నల్ల మిరియాలు, తులసి ఆకులతో సులువుగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే డికాషన్ తయారు చేసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం చూసేయండి. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దీనికి కావలసిన పదార్థాలు:

ఐదు నుండి ఆరు తులసి ఆకులు
మిరియాల పొడి
అల్లం
యాలుకల పొడి
ఎండు ద్రాక్ష

తయారు చేసుకునే విధానం:

ముందుగా ఒక ప్యాన్ లో రెండు గ్లాసుల నీళ్లు పోసి దానిలో తులసి ఆకుల్ని, యాలుకల పొడిని, నల్ల మిరియాలని, అల్లం మరియు ఎండు ద్రాక్షని వేసి మరిగించండి. 15 నిమిషాల పాటు మరిగించి తర్వాత వడ కట్టుకొని ఆ మిశ్రమాన్ని తీసుకోండి.

రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒంట్లో ఉండే మలినాలను తొలగిస్తుంది. నల్ల మిరియాలు, అల్లం, తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి అలానే తులసి లో యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇది రెస్పిరేటరీ సమస్యలు దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు ఈ డికాషన్ ని తీసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version