సాధారణంగా శెనగలతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అలానే ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి కూడా వీటిని బాగా ఉపయోగిస్తాం. పైగా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు ప్రసాదంలా చేస్తాము. అయితే వీటిని ఉడికించి తిన్నా లేదా మరి ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలు దీని ద్వారా మనకి లభిస్తాయి. శెనగలలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి.
శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది కనుక ఏ వయసు వారు తీసుకున్న ఇట్టే తిరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా దీనితో మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇది నిజంగా ఒక ఎనర్జీ బూస్టర్ లాగ కూడా పని చేస్తుంది. చూసారు కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..! మరి మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యాంగా ఉండండి.