కీర దోస ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో సమస్యలు తరిమికొట్టడానికి ఇది మనకి బాగా ఉపయోగ పడుతుంది. కీరా తో వివిధ రకాల రెసిపీస్ ని మనం తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇందులో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైనవి మనకి కీరదోసలో దొరుకుతాయి. అయితే కీరదోస వల్ల ఎలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది:
కీరదోస తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. అలానే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, బ్లోటింగ్ మొదలైన సమస్యల నుండి కూడా బయటపడొచ్చు.
బీపీ తగ్గుతుంది:
ఒక కప్పు కీరదోస లో 440 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం బ్లడ్ వెస్సెల్స్ ని రిలాక్స్ గా ఉంచుతుంది. అలానే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్లు చూస్తుంది. అదే విధంగా హైబీపీ సమస్య నుండి కూడా బయట పడొచ్చు.
డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది:
కీరదోస తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. కీర దోస లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దీనితో డయాబెటిస్ ని అదుపులో ఉంచుకో వచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ సమస్య ఉండదు:
కీరదోస లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడేస్తుంది. ఇలా ఇన్ని లాభాలని మనం కీరా తో పొందొచ్చు. అలానే ఈ సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.