పిల్లలు బొటనవేలు నోట్లో పదే పదే పెట్టుకుంటున్నారు..? ఎత్తు పళ్లు అవుతాయి జాగ్రత్త

-

చిన్నపిల్లలు వద్దన్న పనే పదే పదే చేస్తారు. అందులో మొదటిది నోట్లో వేళ్లు పెట్టుకుని చీకడం. రాత్రి పడుకునేప్పుడు అయితే కచ్చితంగా చేస్తారు. కొంతమంది పేరెంట్స్‌ పిల్లలు నోట్లో వేలు పెట్టగానే తీసేస్తారు. కొన్నిసార్లుచూసిచూడనట్లు వదిలేస్తారు. కానీ పిల్లలు పదే పదే నోట్లో వేళ్లు పెట్టుకుంటే.. వారికి పళ్లు ఎత్తుగా అవుతాయి తెలుసా..? వాళ్లు ఎదిగేకొద్ది పళ్లు ఇంకా ఎత్తుగా మారతాయి.

బొటనవేలు చప్పరించడం వల్ల పిల్లల దంతాలు, మొత్తం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నిరంతర అలవాటు దంత సమస్యకు దారి తీస్తుంది. ముందు దంతాల అమరికకు అంతరాయం కలిగిస్తుంది. ఇలా అయితే భవిష్యత్‍లో దంతాలు సరిచేయడానికి బ్రేస్‌లు అవసరం వస్తుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది.

బొటనవేలు పెట్టకుండా తల్లిదండ్రులు ఈ టిప్స్‌ పాటించండి..

మీ బిడ్డ ఆ అలవాటును మానుకుంటే ప్రశంసలు, బహుమతులు అందించండి. అలవాటు మానేస్తే.. గిఫ్ట్ ఇస్తామని చెప్పండి. వారికోసం రివార్డ్ చార్ట్ తయారు చేయండి. ఇదిగో ఇన్ని రోజులు నువ్ బొటనవేలు నోట్లో పెట్టుకోలేదు.. ఇన్ని బహుమతులు అని చెప్పండి.

బొటనవేలు చప్పరించడాని కారణాలను గుర్తించండి. పిల్లల భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి. ఒత్తిడి, విసుగు, అలసట కారణంగా ఇలా చేస్తున్నారా అని చూడండి. దీనిద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

మీ పిల్లల చేతులు నోటిలోకి తీసుకెళ్లకుండా వారిని వేరే పనలుపై దృష్టి పెట్టేలా చూడండి. రెండు చేతులను ఉపయోగించి ఆడుకోవాల్సిన బొమ్మలు, పజిల్‌లు, ఇతర ఆటలను నేర్పించండి.

కొంతమంది తల్లిదండ్రులు బొటనవేలు నోట్లో పెట్టుకోవడాన్ని తగ్గించేందుకు థంబ్ గార్డ్‌లు లేదా గ్లోవ్‌లను పిల్లలకు ఇస్తారు. ఈ పరికరాలు బొటనవేలు చప్పరించడాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వారికి సంతృప్తి ఉండదు. బొటనవేలును చప్పరించకుండా రిమైండర్‌గా పనిచేస్తాయి.

చేదు రుచి కూడా మీ పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకోకుండా చేస్తాయి. వేప రసం లాంటిది వేలుకు రాయండి. వీటిని చప్పరించడం అసహ్యకరమైనదిగా పిల్లలు అనుకుంటారు. మార్కెట్లో వేరేవి కూడా కొన్ని దొరుకుతాయి. సురక్షితమైనవి, విషపూరితం కానివి తెచ్చుకోవాలి. కానీ ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో వాడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version