ప్రతిరోజు ఉదయం మన శరీరానికి తగినంత ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొందరు బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు అది ఎంతో ప్రమాదం. అందుకే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ బదులు ఓట్స్ ని తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఓట్స్ సూపర్ ఫుడ్ గా భావించవచ్చు. ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సులభంగా జీర్ణం అయ్యే ఈ ఆహారం మనకి తక్షణ శక్తిని అందించడమే కాక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నివారించడంలోనూ సహాయపడుతుంది. మరి ఓట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనము తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి ఓట్స్ : ఓట్స్ లో బీటా బ్లూ కార్న్ అనే ఫైబర్ ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు ఉదయం ఓట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గించవచ్చు ఓట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రించడం గుండె సంబంధిత సమస్యలు నివారించవచ్చు.
బరువు నియంత్రణ : ఈరోజుల్లో ఎక్కువమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారు ఓట్స్ తినడం అలవాటు చేసుకుంటే, బరువు తొందరగా తగ్గొచ్చు. ఓట్స్ లో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది ఉదయం ఓట్స్ తినడం వల్ల రోజంతా ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. దీని ద్వారా అధిక కేలరీల ఆహారం తీసుకోవడం తగ్గించవచ్చు, అంతేకాక ఆరోగ్యకరంగా బరువుని తగ్గవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయి : ఓట్స్ లోని బీటా గ్లూకాన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది రక్తంలోని గ్లూకోస్ పెరగడాన్ని తగ్గిస్తుంది దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్ అద్భుతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. ఉదయం ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా శక్తి సమానంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థ : ఓట్స్ లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఓట్స్ లోని ఫైబర్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చర్మ ఆరోగ్యం: ఓట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి చర్మ ఆరోగ్యానికి పెంచుతాయి ఓట్స్ ను ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగి చర్మం మెరుస్తూ ఉంటుంది. ఓట్స్ పొడిని చేసి మాస్క్ గా ఫేస్ పై అప్లై చేస్తే చర్మ సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
జాగ్రత్తలు: ఓట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి గ్యాస్ లేదా ఉబ్బరం కలగవచ్చు కాబట్టి తగినంత మోతాదులో తీసుకోవాలి. ఓట్స్ ను డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.