వర్షాకాలం చాలా అందమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. అలానే సీజనల్ వ్యాధుల్ని కూడ మనకి పరిచయం చేస్తుంది. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతుంటాయి.ఈ వైరల్ ఫీవర్స్ లక్షణాలని ముందే కనిపెట్టి జాగ్రత్తలు తీసుకొని, వైద్యుని సంప్రదిస్తే ప్రాణానికి ప్రమాదం ఉండదు.మరి ఈ ఫివర్స్ లక్షణాలు ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలంలో వైరల్ ఫీవర్ డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ సీజనల్ వ్యాధులు మనం అందరిలో గమనిస్తాం. టైఫాయిడ్ ఫీవర్ నీరు కలుషితం అవడం వల్ల కలుగుతుంది. మరి డెంగ్యూ,మలేరియా రెండు ఎంతో ప్రమాదకరమైనవి. ఇది దోమకాటుతో వ్యాప్తి చెందుతాయి. ఈడిస్ ఈజిప్టై (Aedes aegypti)అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్ మనిషికి సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు మొదట సాధారణ ఫీవర్ గానీ కనిపిస్తాయి కానీ సరైన సమయంలో మనం డెంగ్యూ అని తెలుసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. ఈ డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం.
డెంగ్యూ లక్షణాలు: డెంగ్యూ వచ్చిన మనిషి చిగుళ్ళు,ముక్కు నుంచి రక్తం రావడం, జ్వరం 104° డిగ్రీలు ఉండడం, ముఖ్యంగా కళ్ల వెనుక భాగంలో తలనొప్పి రావడం, కండరాలు కీళ్లు నొప్పులుగా అనిపించడం శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు రావడం, తీవ్రమైన నీరసం వికారం లేదా వాంతులు కావడం, ఇవేకాక తీవ్రమైన డెంగు కేసుల్లో మలం నుంచి రక్తం రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి వెళ్లి వైద్యుని సంప్రదించాలి. సరైన టెస్టులతో సరైన మందులతో వ్యాధిని అరికట్టవచ్చు.
వర్షాకాలంలో డెంగ్యూ ఎక్కువగా రావడం మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ వ్యాధి రావడానికి ఇంట్లో నీరు నిలిచిపోవడం, దోమల వృద్ధికి ఈ అనువైన ప్లేస్ గా ఏర్పడడం, పాత టైర్లు,పాత గిన్నెలు,కుండీలు ఇతర నీటిని నిల్వ ఉంచే ప్లేసుల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి.
నివారణ చర్యలు: దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. దోమల లార్వాను నాశనం చేయడం,ఇంట్లో పరిసరాలు కుండీలు, కూలర్లు,బకెట్లు, పాత టైర్లులో నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం. వాటర్ ట్యాంకులపై మూతని తప్పకుండా పెట్టడం, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం. బయటకు వెళ్లేటప్పుడు పూర్తిగా చేతులు కలిగిన దుస్తులను ధరించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ ని అరికట్టవచ్చు.
డెంగ్యూ జ్వరం తక్కువగా తీసుకోవాల్సిన వ్యాధి కాదు.వర్షాకాలంలో దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం,లక్షణాలను ముందుగా గుర్తించి సకాలంలో వైద్య సలహా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నియంత్రించవచ్చు.
గమనిక : (ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.మీకు ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి.)