మనం ఇంట్లో ఫర్నిచర్ కు లక్షలు పెట్టడం చూసి ఉంటాం లేదా ఒక కారు, బైక్ కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఇలా ఫర్నిచర్ కి ఇంట్లో వాడే వస్తువులకి మాత్రమే లక్షలు పెట్టడం కాదు అప్పుడప్పుడు మొక్కలకి కూడా లక్షలు పెట్టాల్సి వస్తుంది. అవునండి మీరు వింటున్నది నిజమే మార్కెట్లో ఎంతో విలువైన మొక్కలు లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఇంటి అలంకరణలో కొత్త అందాన్ని ఇస్తాయి. చెట్లు పెంచడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన 7 ఇండోర్ ప్లాంట్స్ గురించి మనము తెలుసుకుందాం..
వేరిగేటెడ్ మాన్‌స్టెరా (Variegated Monstera) : ఈ మొక్క ధర సుమారు రూ.5000 నుండి 30 లక్షలు వరకు ఉంటుంది. తెలుపు,ఆకుపచ్చ ఆకులు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొక్కలోని ఆకులు ఒక్కొక్క వేరియేషన్లో అవి వాటి జన్యుపరమైన ఉత్పత్తి వల్ల లభిస్తుంది. ఈ మొక్కను 2020లో సుమారు 28 లక్షలకు మార్కెట్లో విక్రయించారు.
ఫిలోడెండ్రాన్ స్పిరిటస్ సాంక్టి (Philodendron Spiritus Sancti) : ఈ ప్లాంట్ ధర సుమారు రూ.20 వేలు నుండి 10 లక్షల వరకు ఉంటుంది. ఈ అరుదైన ప్లాంట్ దాని పొడవును, హృదయపు ఆకారంలో ఉండే ఆకులను కలిగి ఉంటుంది. హార్ట్ షేప్ లో ఉండే ఈ ఆకులు, ఆక్సిజన్ ని మనకి అందిస్తాయి. ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఈ మొక్కను పెంచుకోవాలని అందరూ అనుకుంటారు కానీ అంత తేలిగ్గా ఈ మొక్క దొరకదు దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.తక్కువ లైటింగ్ ఉన్న ప్రదేశం లోను ఇది పెరుగుతుంది.
మాన్‌స్టెరా ఒబ్లిక్వా (Monstera Obliqua): ఈ మొక్క ధర సుమారు రూ.2 లక్షలు నుంచి 20 లక్షలు వరకు ఉంటుంది ఈ మొక్క మోర్ కూల్ దాన్ లిఫ్ట్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ మొక్క ఆకులు రంధ్రాలతో నిండి ఉంటుంది ఇది అత్యంత అరుదైన ప్లాంట్ చాలా సున్నితంగా డెలికేట్ గా ఉండే ఈ ప్లాంట్ ను ఆకులు సంరక్షణ చాలా కష్టంతో కూడుకుంది.
షెంజెన్ నాంగ్‌కే ఆర్కిడ్ (Shenzhen Nongke Orchid): ఈ ప్లాంట్ ధర అత్యంత ఖరీదైనది మినిమం కోటి రూపాయల నుంచి మొదలవుతుంది. మానవ నిర్మిత ఆర్కేడ్ ను చైనీస్ శాస్త్రవేత్తలు ఎనిమిది సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పువ్వులను ఇస్తుంది. ఇలా అరుదుగా పుష్పిస్తుంది.
బోన్సాయ్ ట్రీ (Bonsai Tree): ఈ ప్లాంట్ ధర సుమారు పది లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది. దశాబ్దాల కాలం నుండి బోన్ సాయి చెట్లు పెరుగుతున్నాయి వైట్ కలర్ వుండే అత్యంత ఖరీదైన ఇండోర్ మొక్కల్లో ఇది ఒకటి. ఎనిమిది వందల ఏళ్ల వైట్ బోన్సాయ్ సుమారు కోటి రూపాయలకు మార్కెట్లో విక్రయించబడింది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కారణంగానే ఈ మొక్కకు అంత రేటు పలుకుతోంది.
ఫిలోడెండ్రాన్ పింక్ ప్రిన్సెస్ (Philodendron Pink Princess): ఈ ప్లాంట్ ధర సుమారు పదివేల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది ఈ మొక్క గులాబీ మరియు ఆకుపచ్చని ఆకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొక్క నెమ్మదిగా పెరుగుతుంది.
అలోకాసియా అజ్లానీ (Alocasia Azlanii): ఈ ప్లాంట్ ధర సుమారు పదివేల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. బోర్నీయులకు చెందిన ఈ మొక్క ఊదా,ఎరుపు,గులాబీ రంగులతో మెరిసే ఆకులతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ మొక్క రంగులు మార్కెట్లో దీని ఖరీదైన మొక్కగా నిలబెట్టాయి. ఇది అరుదుగా లభించే మొక్కల్లో ఒకటి.
మరి ఇంత కాస్ట్లీ అయినా లక్షలు విలువ చేసే మొక్కలు మీకు నచ్చాయా మీ అనుభవాలు మాతో పంచుకోండి.