డీహైడ్రేషన్‌ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా..?

-

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపునిండా తింటే సరిపోదు. తినే వాటిల్లో పోషకాలు ఉండాలి. లేకపోతే మీరు ఎంత తిన్నా ఏం ఉపయోగం ఉండదు. కొందరు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల.. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. వాటికి కారణాలు ఏంటో కూడా తెలుసుకోలేరు. వాటర్‌ తక్కువగా తాగితే.. ఎన్ని సమస్యలు వస్తాయో మనకు తెలుసు. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ భారిన పడతాం, తద్వారా ముఖం పొడిబారడటం, జీవకళ కోల్పోవడం, నీరసం లాంటి ఎన్నో తలనొప్పులు వస్తాయి. వీటితో పాటు ఈ డీహైడ్రేషన్‌ శృంగారంపైన కూడా ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా..?

డీహైడ్రేషన్ మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హైడ్రేషన్ లోపించడం వల్ల స్త్రీపురుషులు ఇద్దరిలో కూడా అలసట, చికాకు, మూడ్ లేకపోవడం, అంగస్తంభన లోపం, యోని పొడిబారడం వంటి అనేక మార్పులు సంభవిస్తాయట. డీహైడ్రెషన్ మహిళలకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నిర్జలీకరణం యోనిలో పీహెచ్‌ స్థాయిని కలిగిస్తుంది. ఇది సెక్స్ సమయంలోఎక్కువ పెయిన్‌ను కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. శారీరక సంబంధాల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో శృంగార సమయంలో నొప్పి మిమ్మల్ని మరింత బాధపెడుతుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించాలి.

పుచ్చకాయ, నారింజ, సీతాఫలం, పైనాపిల్ మొదలైన వాటిని అధిక మొత్తంలో తినండి. బ్రోకోలీ, దోసకాయ వంటి వాటిని తీసుకోవడం ద్వారా కూడా శరీరంలో నీటి స్థాయిని పెంచుకోవచ్చు.

సూప్‌లు తాగడానికి ప్రయత్నించండి. వాటి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కూరగాయలు, మూలికల సహాయంతో వివిధ రకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. మీ శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు.

కొందరు దాహం వేసినా కూడా నీళ్లు తాగరు. మరికొందరు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ దాహం అనిపించడం మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైందనడానికి సంకేతం. దాహం అనిపించకముందే మీరు నీళ్లు తాగుంతుండాలి. సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో నిర్జలీకరణ స్థాయి అధిక స్థాయికి చేరుకున్నప్పుడు దాహం వేస్తుంది. అందువల్ల, దాహం అనిపించకపోయినా అప్పుడప్పుడు నీరు తాగడానికి ప్రయత్నించండి.

కొందరు వర్క్‌లో బిజీగా ఉండి.. వాటర్‌ తెచ్చుకోవడానికి బద్ధకంతో ఆ సిస్టమ్‌ ముందే కుర్చోని వర్క్‌ చేస్తుంటారు. దాహం వేస్తున్నా వెళ్దాంలే అని పోస్ట్‌పోన్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో నీరు తాగడానికి రిమైండర్ సెట్ చేయండి. ఇది మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. లేదంటే చాలా సమస్యలు వస్తాయి.

సమస్య ఎక్కువగా ఉంటే.. మద్యపానం, ధూమపానం కూడా తగ్గించండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. డీహైడ్రేషన్‌ సమస్య నుంచి బయటపడతారు. లేదంటే.. అది మీ జీవితంలో అతిముఖ్యమైనదాన్ని ఘోరంగా దెబ్బతీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version