నేటి కాలంలో చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చేయాలి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ( Breastfeeding Cancer ) కూడా చాలా మందిలో వస్తోంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను డైట్ లో తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసమే మనం తెలుసుకుందాం.
బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి:
పసుపు:
పసుపుని తక్కువ అంచనా వేయడం అస్సలు మంచిది కాదు. ఎన్నో సంవత్సరాల నుండి పసుపును మనం వాడుతూనే ఉన్నాం. చాలా సమస్యల నుండి పసుపు ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది.
సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫోలేట్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే యాంటీ క్యాన్సర్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కనుక కమలా, నిమ్మ, ద్రాక్ష వంటి వాటిని తీసుకుంటే మంచిది.
బెర్రీస్:
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో ఎక్కువ తీసుకోండి.
చేపలు:
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యని తగ్గిస్తుంది. కనుక దీనిని కూడా తింటే మంచిది.
దానిమ్మ:
దానిమ్మ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. అలాగే ఆకుకూరలు కూడా చాలా మంచిది. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా రెగ్యులర్ గా తినడం మంచిది. అదే విధంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి వాటిని కూడా మీరు మీ డైట్ లో ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.