తెలంగాణ నం.1 గా ఉండటానికి కారణం TDPనే – సీఎం చంద్రబాబు

-

ఇండియాలోనే తెలంగాణ నం.1 గా ఉండటానికి కారణం TDPనే అంటూ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. పాలసీలతో పాలనను ఒక దారికి 1995లో తీసుకొచ్చామని.. దాని ఫలితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతుందని చెప్పారు. నూతన ఆర్ధిక వ్యవస్ధకు దోహదం చేసామన్నారు.

AP CM Chandrababu Naidu made sensational comments in the Assembly saying that TDP is the reason Telangana is No.1 in India

ఒక్క లిటిగేషన్ లేకుండా ల్యాండ్ పూలింగ్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతి భూములు వచ్చాయని తెలిపారు. అన్ని వ్యవస్ధలను నాశనం చేసారు… ఆస్తవ్యస్ధ ఆర్ధిక నిర్వహణలో రాష్ట్రం పరిస్ధితి వెనక్కి పోయిందని ఆగ్రహించారు. ఏపీ జీవనాడి పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కరువనేది రాదు..విద్యుత్ బకాయిలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనాలని చూసారన్నారు. 1.29లక్షల కోట్ల నష్టంలోకి విద్యుత్ శాఖను నెట్టేసారని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version