బ్రెస్ట్ కాన్సర్ రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వయసు, జీన్స్ మొదలైన కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఏది ఏమైనా మనం మంచి పద్ధతులని ఫాలో అవ్వడం ముఖ్యం. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో ఆ సమస్య రాకుండా మీరు సురక్షితంగా ఉండొచ్చు. మరి ఆలస్యమెందుకు వాటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

 

బరువును కంట్రోల్లో ఉంచుకోవడం:

ఉండాల్సిన దాని కంటే ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా బరువు మెయింటైన్ చేయడం చాలా అవసరం. సరిగ్గా ఆరోగ్యకరమైన బరువు ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ మహిళల్లో తగ్గుతుంది. అదే విధంగా కార్డియో వాస్క్యులర్, ఎముకలు, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. యోగా, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం.

తీసుకొనే డైట్:

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. సరైన జీవన విధానాన్ని చాలా మంది పాటించకుండా ఆరోగ్యాన్ని చిక్కుల్లో పెట్టేస్తున్నారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య నుండి బయట పడవచ్చు అని తెలుసుకోండి.

వ్యాయామం తప్పక చేయండి:

ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు తగ్గుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది.

జీవన విధానం:

ఆల్కహాల్, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు తగ్గుతుంది. కాబట్టి తప్పక వీటికి దూరంగా ఉండాలి.

డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి:

కొన్ని మెడికేషన్స్ మరియు కాంట్రాసెప్టివ్, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ వలన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు పెరుగుతుంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోండి. ఈ పద్ధతులు పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version