బాంబోషూట్స్ తింటున్నారా? సైంటిఫిక్ గా ఏం చెప్తున్నారంటే..

-

టిబొందలు నుంచి మువ్వు వస్తుంది..కొబ్బరిచెట్టు నుంచి కూడా ఇలాంటివి వస్తాయి. ఇలాగే వెదురులో కూడా కొత్తపిలకలు వచ్చేప్పుడు లోపల తింటానికి అనుకూలంగా ఉండేది ఒకటి ఉంటుంది. దాన్నే బాంబోషూట్స్ అంటారు. ఈ మధ్య ఇవి బాగా ఫేమస్ అయ్యాయి..ఆన్ లైన్ లో కూడా దొరుకుతున్నాయి. కొంతమంది తింటున్నారు. వీటివల్ల అసలు ఏమైనా లాభాలు ఉంటాయా? ఏం పోషకాలు ఉంటాయి, ఎలా తినాలి, తింటే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఈరోజు చూద్దాం.

ఒక కేజీ బాంబోషూట్స్ ధర 300-400 వరకు ఉంటుంది. వీటిని మాములుగా సలాడ్స్ లో ఆఫ్ బాయిల్ చేసుకుని వేసుకుంటారు. పాస్తాలో వేసుకోవచ్చు. ఫ్రంచ్ ఫ్రైస్ ఎలా చేసుకుంటారో..అలా వీటితో చేసుకుని తినొచ్చు. స్పెషల్ కర్రీస్ చేసుకోవచ్చు. రకరకాల పద్దతుల్లో వాడుకోవచ్చు. వెదురు మొగ్గల్లో ఉండే పోషకాలు ఏంటంటే..

100 గ్రాముల బాంబోషూట్ లో ఉండే పోషకాలు:

పిండిపదార్థాలు 5 గ్రాములు
మాంసకృతులు 2 గ్రాములు
కొవ్వులు 3.3 గ్రాములు
శక్తి 50 కాలరీలు
ఫైబర్ 1.5 గ్రాములు
నీటిశాతం 80 గ్రాములు

కూరగాయలకు ఎలాంటి పోషకాలు ఉంటాయో..ఈ బాంబోషూట్స్ కి కూడా అలాంటి పోషకాలే ఉన్నాయి. తేలిగ్గా డైజెషన్ అవుతాయి. రుచికి రుచి. నిజానికి ఇవి పూర్వంరోజుల్లో అడవుల్లో ఉండేవాళ్లు తినేవాళ్లు..మళ్లీ ఇప్పుడు ఇవి ఫేమస్ అయ్యాయి. సైంటిఫిక్ గా ఇవి తింటే ఎలాంటి లాభాలు ఉంటాయి అనే ఇచ్చారంటే..

ప్రత్యేకంగా ఈ బాంబోషూట్స్ మీద 2009వ సంవత్సరంలో వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటి( Washington State University- USA) వాళ్లు పరిశోధన చేశారు.

ఈ బాంబోషూట్స్ ను వండుకుని 350 గ్రాములు చొప్పున 6రోజులు తినేసరికి బాడ్ కొలెస్ట్రాల్ 30శాతం తగ్గిందని గుర్తించారు. అంటే LDL అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే ఈ బాంబోషూట్స్ బాగా తగ్గిస్తుందని నిరూపించారు. గుండెజబ్బులకు ఈ కొలెస్ట్రాల్ ప్రధాన కారణం.

2006వ సంవత్సరంలో జీఈ యాంగ్ యూనివర్సిటి- చైనా( GE Yang Universtiy- China)వారు పరిశోధన చేసి..ఇందులో ఉన్న కార్భోహైడ్రేట్స్, ఫైబర్ ముఖ్యంగా..చిన్న ప్రేగుల్లో ప్రోబయోటిక్స్ ను బాగా పెంచుతుంది..పేగుల్లో రక్షణ వ్యవస్థ మెరుగవుతుంది అని పేర్కొన్నారు.

ఇంకో ముఖ్యమైనవిషయం ఏంటంటే..ఇందులో ఉన్న లిగ్నిన్ అనే యాంటిఆక్సిడెంట్ వల్ల మన బ్రెయిన్ లో ఉండే నర్వస్ ను డామేజ్ అవ్వకుండా బాగా కాపాడుతుంది..దీని ద్వారా ఏజ్ పెరిగేటప్పుడు కూడా నరాలు బలహీనం అవకుండా ఇవి పనికొస్తున్నాయని పరిశోధనలో ఇచ్చారు.

వీటివల్ల ఇంకో లాభం ఏంటంటే..శరీరం అలిసిపోకుండా..ఎప్పుడు ఎక్కువగా యాక్టివ్ గా ఉండేట్లు, ఎనర్జీగా ఉండేట్లు చాలాబాగా చేస్తుందట. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటిఆక్సిడెంట్స్ కణజాలన్ని రక్షించి..శరీరం ఎక్కువ గంటల సేపు ఎనర్జీగా ఉంటుందని చైనావారు పరిశోధనలో తెలిపారు.

ఇన్ని రకాల బెనిఫిట్స్ సైంటిఫిక్ గా ఉన్నాయని నిరూపించారు కాబట్టి..ఆన్ లైన్ లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి..మీరు కూడా వీలైనప్పుడు వీటిని అప్పుడప్పుడు వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version