భోజనాన్ని వేగంగా తినడం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్‌ ఎక్కువ తెలుసా..?

-

కడుపు నిండా తినడం ఒక పద్ధతి, ఏదో ఒకటి ఆ టైమ్‌కు పొట్టలో వేస్తే చాలులే అనుకునేవాళ్లు ఉంటారు. ఇంట్లో ఉంటే.. టీవీ చూస్తూ తినే వాళ్లు ఉంటారు. కొంతమంది స్పీడ్‌గా తింటారు, ఇంకొంతమంది మరీ లేట్‌గా తింటారు. ఫుల్‌ బిర్యానీని కూడా ఐదు నిమిషాల్లో ఖాలీ చేసే మహానుభావులు ఉన్నారు. అసలు భోజనం త్వరగా తినాలా లేక స్లోగా తినాలా..? జనరల్‌గా మన పూర్వీకులు అయితే.. తినే ముందు మగవాళ్లు కాళ్లు కడుక్కోని వస్తారు. ఆ కాలి బొటనవేలి తడి ఆరేలోపే మగవాళ్లు భోజనం కంప్లీట్‌ చేయాలంట. అంటే అంత ఫాస్ట్‌గా తినాలి అని చెప్తుంటారు. నిజంగా అలా స్పీడ్‌గా తినొచ్చా..? దీనిపై నిపుణులు ఏం అంటున్నారు.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, దాదాపు 25 నుండి 30 నిమిషాలు తినాలి. మీరు మీ భోజనాన్ని పూర్తిగా ప్రశాంతంగా ముగించి, నెమ్మదిగా నమలమని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

అతివేగంగా తినడం వల్ల కలిగే నష్టాలు:

  • అతి వేగంగా తినడం వల్ల ఆహారం గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు ఇది గొంతులో ఇరుక్కుపోయి ప్రమాదానికి కారణమవుతుంది.
  • తొందరపడి ఆహారం తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. కానీ దీన్ని పూర్తిగా నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత సులభతరం అవుతుంది.
  • స్పీడ్‌గా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇది రోజువారీ జీవన సాధారణ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల మీ పొట్ట పని సులభం అవుతుంది.
  • తొందరగా తినడం వల్ల వచ్చే మరో ప్రతికూలత ఏమిటంటే, త్వరగా బరువు పెరగడం. ఈ చెడు అలవాటు ఇలాగే కొనసాగితే పొట్ట, నడుము మీద దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
  • వేగంగా తినడం వల్ల మీ శరీరంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలా తినే అలవాటు వల్ల ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది..
    ఈ చెడు అలవాటు వల్ల మీరు మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడవచ్చు. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
  • స్లోగా భోజనాన్ని ఆస్వాదిస్తూ, పూర్తిగా నమిలి తినాలి. అప్పుడే మీరు తిన్నది త్వరగా అరుగుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంతకీ మీరు ఎంత టైమ్‌లో తింటారు..?

Read more RELATED
Recommended to you

Exit mobile version