స్టమక్‌ బగ్‌ అంటే ఏంటో తెలుసా..? ఆ ఆహారాలు తినే వారికే ఎక్కువగా వస్తుందట..!

-

స్టమక్‌ బగ్‌ : సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ గురించి మీరు విని ఉంటారు.. కానీ స్టమక్‌ బగ్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ప్రస్తుత రోజుల్లో బయట జంక్ ఫుడ్‌కి జనాలు బాగా అలవాటు పడి రకరకాల రోగాల పాలవుతున్నారు. ఎక్కువగా కడుపులో ఇన్ఫెక్షన్‌కి గురవుతున్నారు. దీనివల్ల కడుపులో పేగులు వాపుకు గురవుతున్నాయి. కడుపులో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల కడుపు ఇన్ఫెక్షన్‌కి గురై.. ఏమి తినలేరు తాగలేరు.. దీన్నే స్టమక్‌ బగ్‌ అంటారు. కడుపు ఇన్ఫెక్షన్ గురైతే వాంతి, నోరు పొడిబరి పోవటం, పొత్తికడుపు నొప్పి రావడం జరుగుతుంది..

స్టమక్‌ బగ్‌

 

కడుపులో ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు కనిపించే లక్షణాలు..

విపరీతమైన చలి లేదా చెమటలు పట్టడం
చర్మం జిడ్డుగా మారటం
కీళ్లు బిగుతుగా మారడం లేదా కండరాల నొప్పి

కడుపు ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణాలు..

కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం
పాతబడి పోయిన కలుషితమైన ప్లేట్‌లలో తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా
వ్యాధి సోకిన వ్యక్తితో ఆహారం పంచుకోవడం

వ్యాధిని ఎలా నిర్ధారించాలి..?

కడుపు ఇన్ఫెక్షన్‌కి గురైంది అని ప్రధానంగా డిహైడ్రేషన్ సంకేతాల ఆధారంగా వైద్య విషయం నిర్ధారించబడుతుంది. వాటిలో ప్రధానంగా చూసుకుంటే

యూరిన్ టెస్ట్
బ్లడ్ టెస్ట్
అల్ప రక్తపోటు
అధిక గాడత ఉండే మూత్రం
కళ్ళు లోతుకు వెళ్ళిపోవటం
కన్నీళ్లు లేకపోవడం
బద్ధకం లేదా కోమ.
పొడిబారిన లేదా జగటగా ఉండే నోరు.. ఇవి ఉంటే మీ కడుపు ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లే..

ఈ లక్షణాలు ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.. ఈ పరిస్థితుల్లో.. ద్రవ పదార్థాలను, తాజా పండ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తినాలి. ఆహారంలో ఉడకబెట్టిన కూరగాయాలు, తృణధాన్యాలను చేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే.. వ్యాధి తగ్గిన తరువాత కూడా జంక్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా తినకూడదు.. అసలు వీలైనంత వరకూ బయటి ఆహారాలను తినకపోవడమే మంచిది.. ఈరోజుల్లో రోగాలు ఎక్కువగా ఉంటున్నాయి కానీ..వాటికి మూలకారణాలు మాత్రం కామన్‌గా ఒకటే ఉంటున్నాయి.. పచ్చడి మెతుకులైనా సరే.. ఇంట్లో తయారుచేసినవే తినడం ఉత్తమం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version