మునగాకు (డ్రమ్‌స్టిక్ ఆకులు)ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకులో విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారానికి కనీసం మూడు రోజులు మునగాకు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగాకు కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. మరి ఏ పదార్థాలతో కలిపి తీసుకోవాలో వాటి వల్ల వచ్చే లాభాలను మనము తెలుసుకుందాం..
మునగాకును పసుపు కలిపి తీసుకుంటే, కడుపులో మంట తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పసుపులో ఉండే కర్కుమిన్‌తో కలిసి శరీరం ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. మునగాకు కూరలో ఒక చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. మునగాకు రసంలో పసుపు పొడి కలిపి తాగితే చర్మం ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మునగాకు రసంలో ఒక టీ స్పూన్ తేనె వాడితే, శరీరానికి తక్షణ శక్తి వస్తుంది తేనెలోని సహజ చక్కెర మునగాకులో విటమిన్ ఏ,సి లతో కలిస్తే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో మునగాకులో తేనె కలిపి తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
మునగాకు-శెనగపప్పు కలిపి కూర లేదా సూప్ లాగా తయారు చేసుకుని తినవచ్చు శనగపప్పులో ఉండే ప్రోటీన్, ఫైబర్ మునగాకులోని ఐరన్, కాల్షియంతో కలిస్తే ఎముకలు కండరాలు బలపడతాయి. అంతేకాక రక్తహీనతను నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మునగాకు సూప్ లో అల్లం తురిమి వేస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. అల్లం లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మునగాకు తో కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు తగ్గుతాయి. మునగాకు రసంలో కొబ్బరి నీళ్లు కలిపి తాగడం వలన, శరీరంలోని నీటిలోపం తగ్గుతుంది. కొబ్బరినీరులోని ఎలక్ట్రోలైట్స్, మునగాకులోని విటమిన్లతో కలిస్తే శరీర శక్తి పెంచడమే కాక చర్మ ఆరోగ్యానికి రక్తప్రసరణకు కూడా ఉపయోగపడతాయి.
బెల్లంను మునగాకు పొడిలో కలిపి తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మునగాకులో కూడా ఐరన్ ఉంటుంది ఇవి రెండూ కలిస్తే రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. మహిళల్లో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి.)