రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సేపు కుర్చోని పనిచేస్తున్నారా..? ఐదేళ్లకు ఏం అవుతుందంటే..!!

-

జాబ్‌ చేసేవాళ్లు రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు కుర్చోనే ఉంటారు. ఇక సాఫ్ట్‌వేర్ వాళ్లు అయితే చెప్పలేం.. ఒక్కసారి కుర్చుంటే.. అది ఎంత అనేది ఎవరి చేతుల్లో ఉండదు. వీటికి తోడు..మిగిలిన టైమ్‌లో ఏమన్నా.. వ్యాయామాలు లాంటివి చేస్తారా అంటే అదీ లేదు. రోజుకు 8 గంట‌ల క‌న్నా మించి ఎక్కువ సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా మ‌న వెన్నెముక ఆంగ్ల ఎస్ అక్ష‌రం షేప్‌లో ఉంటుంది. కానీ అలా రోజూ ఎక్క‌వ సేపు కూర్చుని ప‌నిచేస్తే 5 ఏళ్ల‌కు మ‌న వెన్నెముక ఆంగ్ల సి అక్ష‌రం షేప్‌కు మారుతుంది. ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం వ‌ల్ల పొట్ట‌, ఛాతి ద‌గ్గ‌ర ఉండే కండ‌రాలు వీక్ అవుతాయి. దీంతో ఆ భాగంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. ఫలితంగా అది వెన్నెముక షేప్ అవుట్‌కు కార‌ణ‌మ‌వుతుంది. దీంతోపాటు చూపులో తేడా వ‌స్తుంది. దృష్టి త‌గ్గుతుంది. త‌ల‌నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది.

బోనస్‌గా గుండెజబ్బులు..

కూర్చుని ఉద్యోగాలు చేసే చాలా మందికి గుండె జ‌బ్బులు, హైబీపీ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో గుండె సంబంధ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తాయి. ఈ క్ర‌మంలో ర‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అది ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లిగిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయి. శారీర‌క శ్ర‌మ చేసే వారి క‌న్నా చేయకుండా, కూర్చుని ప‌నిచేసేవారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం 54 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

రక్తం గడ్డకడుతుంది..

నిరంత‌రాయంగా కూర్చుని ప‌నిచేయ‌డం వ‌ల్ల కాళ్ల‌లో ఉండే ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ కడుతుంది.. దీంతో ఆయా ప్ర‌దేశాల్లో ర‌క్త నాళాల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క అక్క‌డ నాళాలు వాస్తాయి.. ఇది ఎక్కువైతే ఆ వాపులు బ‌య‌ట‌కు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య కూడా ఎక్కువ సేపు కూర్చుని ప‌ని చేసే వారికి వ‌స్తుంది. కాళ్ల‌ను మ‌డిచి లేదా ఒక దానిపై మ‌రొక‌టి వేసుకుని కుర్చీలో కూర్చునే వారికి ఈ స‌మ‌స్య త్వ‌ర‌గా వ‌స్తుంది. ర‌క్త స‌ర‌ఫరా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతేనే ఈ స‌మ‌స్య వ‌స్తుంది.

నిత్యం కూర్చుని ఉద్యోగం చేసే వారిలో కండ‌రాలు, ఎముక‌లు త్వ‌ర‌గా బ‌ల‌హీనంగా మారిపోతాయ‌ట‌. దీంతో వారిలో ఆస్టియోపోరోసిస్ స‌మ‌స్య త్వ‌రగా వ‌స్తుంద‌ట‌. అలా అని అధ్య‌య‌నాలే చెబుతున్నాయి. అలాగే నిత్యం కూర్చుని ప‌నిచేసే వారిలో రోజు రోజుకీ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా మంద‌గిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు క‌ణాలు ఇన్సులిన్‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌క…ర‌క్తంలో గ్లూకోజ్ అధికంగా పేరుకుపోయి అది టైప్ 2 డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలు ఉన్నాయి.. అలా అని మరి నుంచోని పనిచేయాలా, లేక అస్సలు పనే చేయొద్దా అంటారేమో.. చేయండి.. కానీ గంట గంటకు ఒకసారి లేచి నడవండి.. అలా మొద్దులా ఒకేచోట గంటలతరబడి కుర్చోకండి.. అంతే కాదు.. ఆహారం మీద ఎక్కువ ఫోకస్‌ చేయండి.. అంటే ఎక్కువ తినమనికాదు.. తినే ఆహారం హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. బయట ఆహారాలు తినకండి. ఊకే.. బిర్యానీలు, బర్గర్లు అంటే.. ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది.

ఇంట్లో తయారు చేసేవి తినండి.. ఎక్కువగా ఆకుకూరలను డైట్‌లో భాగం చేసుకోండి. దాంతోపాటు.. ఎలాఅయినా రోజులో 30 నిమిషాలు శరీరానికి బాగా చెమటపట్టించేలా చేయండి.. అలా చేయాలంటే.. వ్యాయామం చేయడమే మార్గం..సన్నగా ఉన్నాను కదా నాకెందులే ఈ వ్యాయామాలు అనుకోకండి.. వ్యాయామం చేయడం వల్ల బాడీలో పార్ట్స్‌ అన్నీ ఉత్తేజమవుతాయి.. బాగా పనిచేస్తాయి.. అన్ని చోట్ల బ్లడ్‌ సర్కులేషన్‌ అవుతుంది. ఇప్పుడు మంచుగడ్డలు ఉంటాయి.. వాటికి వేడి తగిలితే అవి కరిగిపోతాయి.. లేకుంటే.. మీరు వాటిపైన ఏం వేసినా అవి గ్రహించుకోలేవు..అలానే ఉండిపోతాయి కదా.. మన బాడీ కూడా అంతే.. మీరు వ్యాయామం అనే వేడిని బాడికి రోజు కొంతసేపు ఇస్తే.. ఆ వేడికి లోపల మంచు అనే కొవ్వు కరిగి.. రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే.. మీరు ఆరోగ్యంగా ఎన్ని ఏళ్లు అయినా పనిచేయగలుగుతారు..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version