SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో ఒకరైన గుర్ ప్రీత్ సింగ్ సోదరుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయకచర్యలపై తాజాగా స్పందించారు. ‘మా తమ్ముడిని తెలంగాణ ప్రభుత్వం కాపాడలేదు. కాపాడుతుందని అంతా అనుకున్నాం. కానీ, ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు.టన్నెల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏం పని జరగలేదు..కూలినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది.
అందరూ ఫోన్‌లల్లో పడ్డారు తప్ప.. లోపల చిక్కుకుపోయిన 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదు.అందుకే మా పంజాబ్ ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని కోరుతున్నాం’ అని వెల్లడించారు. ఎక్కడ పనులు అక్కడే ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా తమ్ముడిని కాపాడుతారని అనుకున్నాం.. కానీ ఈ ప్రభుత్వం కాపాడలేకపోయింది
టన్నెల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏం పని జరగలేదు.. కూలినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది
అందరూ ఫోన్ లల్లో పడ్డారు తప్ప లోపల 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదు
మా పంజాబ్ ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సహాయక… pic.twitter.com/HimWFtTJEh
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2025