ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ రోజుల్లో సక్సెస్ కోసం అందరూ పరిగెత్తారు. కానీ మనం చేసే కొన్ని పనుల వల్ల సక్సెస్ కి దూరమవుతూ ఉంటాం. మనం రోజు అలవాటుగా మారిన ఈ పనులు కు దూరంగా ఉంటే సక్సెస్ ని అందుకోగలుగుతాం అంటున్నారు నిపుణులు. ఇంతకీ మనం మార్చుకోవాల్సిన అలవాట్ల గురించి చూద్దాం..
ప్రతిరోజు ఉల్లాసంగా మనం మొదలు పెట్టడానికి ఉదయం చాలా ముఖ్యమైన సమయం ఉదయం నిద్ర లేవగానే చేసే ప్రతి పని మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మనలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లని చేస్తుంటాం వాటి గురించి ఇప్పుడు చూద్దాం..
సమయానికి నిద్రలేవకపోవడం: ప్రతిరోజు ఉదయం మనం సరైన టయానికి నిద్రలేవడం అనేది అలవాటు చేసుకోవాలి. బెడ్ పై నుంచి లేవగానే ఫోన్ కి అతుక్కుపోకుండా, శరీరానికి ఉపయోగపడే కొన్ని పనులపై మనం దృష్టి సారించాలి. ముఖ్యంగా వ్యాయామం అలవాటు చేసుకోవాలి అది మన శరీరాన్ని ఫిట్గా ఉంచడంతోపాటు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అందుకే నిద్ర లేవగానే మనం ముఖ్యంగా కొంత టైం ని మన కోసం కేటాయించుకొని, యోగ మెడిటేషన్ వ్యాయామం చేయాలి.

ఆరోగ్యకరమైన అల్పాహారం: ప్రతిరోజు ఉదయాన్నే శరీరానికి శక్తినిచ్చేది అల్పాహారం మాత్రమే ఇది మీకు జీవక్రియ ను మెరుగుపరుస్తుంది. ఓట్స్,పండ్లు, ధాన్యపు రొట్టెలను తీసుకోవడం, మితంగా అల్పాహారాన్ని తీసుకోవడం వలన బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు ఉదయాన్నే ఏది పడితే అది తినకుండా, ముఖ్యంగా మసాలా జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోవడం : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు చిన్న విషయాన్ని కూడా ఎంతో ఆలోచిస్తూ ఒత్తిడికి గురి అవుతున్నారు. ఒత్తిడి వల్ల దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, మానసికంగా అనారోగ్యానికి గురవడం జరుగుతుంది రోజు ఉదయం లేవగానే సానుకూలమైన ఆలోచనలపై ఫోకస్ పెట్టడం మంచిది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వలన ఒత్తిడికి గురి అవుతాం. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయలను చూసుకోవాలి. మ్యూజిక్ వినడం, సరదాగా స్నేహితులతో మాట్లాడడం. మనసుకి నచ్చే పనులను చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.