సన్నగా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ కొందరు మాత్రమే నాజుకైన బాడీని కలిగి ఉంటారు. మనదేశంలో ఏటా ఊబకాయుల సంఖ్య పెరిగిపోతుంది. ఊబకాయం వల్ల వచ్చే రోగాల సంఖ్య కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. బరువు పెరుగుతున్నాం అని ఎప్పుడైతే అర్థమైందో అప్పటినుంచే ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి..? ఆహారం మీద నియంత్రణ, తేలికపాటి వ్యాయామం చాలు హెల్తీగా ఉండేందుకు. అయితే మీరు నిజంగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే ఈ చిట్కాలు ఓ సారి చూడండి. ఇవి సిల్లీగా ఉండొచ్చేమో కానీ.. సీరియస్‌గా ఫాలో అయితే రిజల్ట్ పక్కా ఉంటుంది. బరువు తగ్గడం కష్టమే..అసాధ్యం అయితే కాదు కదా..!
భోజనం చేసేప్పుడు.. తినేందుకు చిన్ని సైజు ప్లేటును ఎంచుకోవాలి. దీని వల్ల తక్కువ మొత్తం తినేందుకు అవకాశం ఉంటుంది. పెద్ద ప్లేటు పెట్టుకుంటే ప్లేట్ అంతా నింపాలనిపిస్తుంది. చిన్నది అయితే ఒకదాని తర్వాత ఒకటి తినొచ్చుగా అంటారేమో.. ప్లేటులో సరిపడా ఆహారం పెట్టుకుని వంటగది నుంచే వచ్చేయండి.! అంతే మళ్లీ మళ్లీ పోవుడు పెట్టుకుని తినుడు బంద్ చేసేయాలి..! ఇంకా కడుపు నిండిందనే భావన రావటానికి ముందే తినటం ముగించేయాలి. కడుపు నిండా వారానికి ఒకసారి తింటే తప్పులేదు. డైలీ అవసరం లేదు. ఎప్పుడూ పొట్టను 80శాతం మాత్రమే నింపాలి. మిగిలిన గ్యాప్ ఉంచాలి..
ఒకేసారి బరువు తగ్గాలనే ఆలోచన చేయోద్దు. వారానికి అరకిలో లేదంటే కిలో తగ్గితే చాలు అంతకన్నా బరువు తగ్గటం అస్సలు మంచిది కాదు.
భోజన సమయంలో కాకుండా మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తే వెంటనే వంటగది వైపో రోడ్డుమీద ఉన్న చాట్‌బండి వైపో చూడొద్దు. బాగా ఆకలిగా ఉంటే కొవ్వులేని పదార్థాలు తినాలి. లేదంటే ఫ్రూట్స్ తీసుకోండి.
నూనెలో తయారైన వేపుళ్లు తినటం తగ్గించాలి. అసలు తినకపోవటమే మంచిది. పులుసు కూరలు తినండి. బిస్కెట్లు, కేకులు వంటివి తీసుకోవద్దు. ఉదయం నిద్రలేవగానే పరగడపున రెండు గ్లాసుల మంచి నీరు తాగండి. భోజనానికి అరగంట ముందు క్యారెట్, క్యాబేజి వంటి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని తీసుకోండి.
పీచు ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి. పళ్లు, పచ్చికూరగాలు తినటం మంచిది. వీటిని తీసుకోవటం వల్ల లావుగా మారే సమస్య ఉండదు. ప్రతి వారం బరువును చెక్ చేసుకుని దానిని నమోదు చేసుకోవాలి..
ఈ చిట్కాలు పాటించడం వల్ల ఈజీగా సన్నగా అయిపోవచ్చు. అయితే మీకు వీలుంటే వీటితో పాటు డైలీ ఒక అరగంట వ్యాయామం కూడా చేయండి.! రిజల్ట్ ఇంకా బాగుంటుంది. బరువు తగ్గాలంటే తిండి మానేయక్కర్లేదు..తగ్గిస్తే చాలు..!