సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఆయన స్టేషన్ ఘనపూర్‌కు వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై విరుచుక పడ్డారు.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నిన్న టి సభకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. ‘మండే ఎండల్లో… గుండెల నిండా అభిమానంతో… ఘన స్వాగత నాయక గణంతో… ఆకాంక్షలు నెరవేర్చే అన్నగా… స్టేషన్ ఘన్ పూర్ ఆలింగనం చేసుకున్నది’ అని రాసుకొచ్చారు. కాగా, మండే ఎండను సైతం లెక్కచేయకుండా ఘనపూర్ ప్రజలు తన సభను విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.
మండే ఎండల్లో…
గుండెల నిండా అభిమానంతో…
ఘన స్వాగత నాయక గణంతో…
ఆకాంక్షలు నెరవేర్చే అన్నగా…
స్టేషన్ ఘన్ పూర్ ఆలింగనం చేసుకున్నది.#TelanganaPrajaPrabhutwam#PrajaPalana #TelanganaRising pic.twitter.com/ipgoNIpDh1— Revanth Reddy (@revanth_anumula) March 17, 2025